తీరంలో ముసురు.. చలిగాలులు
గ్రామాల హద్దులను తాకుతున్న కెరటాలు
వాకాడు: దిత్వా తుపాన్ ప్రభావంతో సోమవారం జిల్లాలోని సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో ముసు రు వర్షంతోపాటు చలిగాలులు వీయడంతో ఆయా గ్రామాల ప్రజలు చలికి గజగజ వణుతున్నారు. అలాగే సముద్రం ఉగ్రరూపం దాల్చి దాదాపు 20 మీటర్లు ముందు జరిగి గ్రామాల సమీప తీరాన్ని తాకుతుండడంతో తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారులు ఐదు రోజులుగా ఇంటికి పరిమితమై ఆకలితో అలమటిస్తున్నారు. తుపాన్ సమయాల్లో బాధిత గ్రామాల ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తుందని సముద్ర తీర ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం అత్యవసర పరిస్థితి లో కూడా ప్రజలు బయటకు రాలేకున్నారు. పనుల కు వెళ్లలేక ఇంట్లోనే ఉన్న ఆయా కుటుంబాల ప్రజ లు తిండి తిప్పలకు నానా అగచాట్లు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో తుపాన్ సమయాల్లో ఉచితంగా బియ్యం ఇచ్చేవారని, నేడు ఎవరు పట్టించుకోవడంలేదని మత్స్యకార కుటుంబాలు వాపోతున్నాయి. ప్రధానంగా సముద్ర తీర ప్రాంతానికి స మీపంలో ఉన్న చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేట మండలాల్లో ఉష్ణోగ్రత బాగా తగ్గిపో యి చలిగాలులు ఎక్కువగా ఉండడంతో ప్రజలు చ లికి తట్టులేక వేడి ప్రదేశాల్లో ఉన్న గృహాల్లో తలదాచుకుంటున్నారు. లోతట్టు గ్రామాల వీధులు వర్ష పు నీటితో ఛిధ్రమై నదులను తలపిస్తున్నాయి.
తీరంలో ముసురు.. చలిగాలులు


