
శేషవాహనంపై కుమారస్వామి
శ్రీకాళహస్తి : శ్రీవళ్లీ, దేవసేన సమేత కుమారస్వామి శనివారం యాళి వాహనంపై ఊరేగారు. శ్రీకాళహస్తిలో ఆడికృత్తిక ఉత్సవాలను పురస్కరించుకుని కుమారస్వామి, అమ్మవార్లను ఆలయ అలంకార మండపంలో అభిషేకాలు నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, మేళ తాళాల మధ్య స్వామి, అమ్మవార్లను యాళి వాహనంపై పుర వీధుల్లో ఊరేగించారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా విజ్ఞానగిరిపై వెలసిన శ్రీవళ్లీ దేవసేన సమేత కుమారస్వామి శనివారం రాత్రి శేష వాహనంపై ఊరేగారు.
సీఎం చంద్రబాబుకు
సాదర స్వాగతం
రేణిగుంట : తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం శనివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అధికార యంత్రాంగం సాదరంగా స్వాగతం పలికింది. విమానాశ్రయ వెలుపల పార్టీ కార్యకర్తలు, ప్రజల నుంచి సీఎం అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, డీఐజీ షిమోషి బాచ్ పాయ్, జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశ, ఎమ్మెల్యేలు ఆరని శ్రీనివాసులు, ఆదిమూలం, నెలవల విజయశ్రీ , పాశం సునీల్ కుమార్, భానుప్రకాష్, కె.రామకష్ణ, మురళి, సుధీర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, తదితర అధికారులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

శేషవాహనంపై కుమారస్వామి