
నేడు బీఎన్‌ఐ కాన్‌క్లెవ్.. 2.0
తిరుపతి కల్చరల్ : వ్యాపార రంగంలో వ్యాపార సంబంధాల అభివృద్ధిపై వ్యాపారవేత్తలకు కరకంబాడి రోడ్డులోని ఆశా కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీఎన్‌ఐ కాన్‌క్లెవ్..2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీఎన్‌ఐ సంస్థ చైర్మన్ మణి సందీప్ తెలిపారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సుమారు 1500 మందికిపైగా ప్రముఖ వ్యాపార వేత్తలు , పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనుభవజ్ఞులైన వ్యాపార, పారిశ్రామిక వేత్తలచే బిజినెస్ స్పీచ్, నెట్‌వర్కింగ్, ప్రొడక్ట్ షోకేస్‌లు, స్పెషల్ ఇంటరాక్టీవ్ సెషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ వ్యాపార వేత్తలు, పారిశ్రామిక వేత్తలందరూ పాల్గొని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో బీఎన్‌ఐ ఈడీ సంతోష్, ప్రతినిధులు దుర్గా ప్రసాద్, వంశీకృష్ణ, స్వాతి పాల్గొన్నారు.