
జాతీయస్థాయిలో రాణించాలి
తిరుపతి ఎడ్యుకేషన్ : చాంపియన్స్‌గా నిలిచిన చిత్తూరు జిల్లా సీనియర్స్ క్రికెట్ జట్టు ఇదే స్పూర్తితో జాతీయ స్థాయిలో రాణించాలని చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ (సీడీసీఏ) అధ్యక్షుడు విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం తిరుపతిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆ జట్టు సభ్యులను విజయ్‌కుమార్ అభినందించారు. జూన్ 28 నుంచి ఈనెల 12వ తేదీ వరకు అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో జోన్ డే మ్యాచ్‌లను నిర్వహించారు. ఈ పోటీల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా సీనియర్స్ క్రికెట్ జట్టు కడప, కర్నూలు, అనంతపురం జట్లపై విజయం సాధించి చాంపియన్స్‌గా నిలవడం గర్వంగా ఉందన్నారు. ఇదే స్పూర్తితో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు క్రికెటర్లు కృషి చేయాలని కోరారు.