హైదరాబాద్‌ రోడ్డు ప్రమాదంలో కాంపాళెం యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ రోడ్డు ప్రమాదంలో కాంపాళెం యువకుడి మృతి

Jul 19 2025 3:21 AM | Updated on Jul 19 2025 3:21 AM

హైదరా

హైదరాబాద్‌ రోడ్డు ప్రమాదంలో కాంపాళెం యువకుడి మృతి

బుచ్చినాయుడుకండ్రిగ : హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంపాళెం గ్రామానికి చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కాంపాళెం గ్రామ దళితవాడకు చెందిన గంధం మల్లెమ్మ కుమారుడు గంధం నరసింహులు (28) ఏడాది కాలంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. గురువారం రాత్రి డ్యూటీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా బస్సు ఢీకొంది. దీంతో నరసింహులుకు తీవ్ర గా యాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. పో లీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పో స్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నరసింహులు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి లేని నరసింహులుపై ఆధారపడి తల్లి, సోదరి జీవనం సాగిస్తున్నారు. మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.

తప్పిపోయిన బాలికను అప్పగింత

కలువాయి(సైదాపురం) : మతిస్థిమితం లేక తప్పిపోయిన ఓ బాలికను కలువాయి పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కలువాయికి చెందిన మోడిబోయిన చంద్రకు పెళ్లి అయి ఒక పాప ఉంది. మతిస్థిమితం సరిగ్గాలేని పాప ఈనెల 16వ తేదీన రైలు ఎక్కి తిరుపతికి వెళ్లిపోయింది. రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు పట్టుకొని విచారించి కలువాయి ఎస్‌ఐ కోటయ్యకు సమాచారం అందించారు. స్పందించి ఎస్‌ఐ వారి వివరాలు సేకరించి కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చి ఐసీడీఎస్‌ అధికారుల ఆధ్వర్యంలో ఆ బాలికను ఆమె తండ్రికి అప్పగించారు.

బడికి పంపకుండా నిరసన

తడ : మా బడి.. మాకే కావాలంటూ తడ హరిజనవాడకు చెందిన తల్లిదండ్రులు చేస్తున్న నిరసన అయిదు రోజులుగా సాగుతోంది. ఈనెల 14వ తేదీ నుంచి తమ పిల్లలను బడికి మాన్పించి ఇళ్లకే పరిమితం చేసి 5 రోజులు గడిచినా అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడుల విలీన ప్రక్రియలో భాగంగా తడ హరిజనవాడలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన 46 మంది విద్యార్థుల్లో 28 మందిని తడకండ్రిగ ప్రాథమికోన్నత పాఠశాలకు బదిలీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అప్పటి నుంచి పలుసార్లు అధికారులకు గ్రామస్తులు వివతి పత్రాలు అందించారు. సరైన స్పందన లేకపోవడంతో నిరసనలకు దిగారు.

హైదరాబాద్‌ రోడ్డు ప్రమాదంలో కాంపాళెం యువకుడి మృతి 
1
1/2

హైదరాబాద్‌ రోడ్డు ప్రమాదంలో కాంపాళెం యువకుడి మృతి

హైదరాబాద్‌ రోడ్డు ప్రమాదంలో కాంపాళెం యువకుడి మృతి 
2
2/2

హైదరాబాద్‌ రోడ్డు ప్రమాదంలో కాంపాళెం యువకుడి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement