
అడ్మిషన్ల లెక్క తప్పింది!
పాఠశాల విద్యపై కూటమి సర్కారు శీతకన్ను.. విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం.. పాఠ్యాంశ నిపుణుల కొరత.. ప్రత్యేక తరగతుల లేమి.. అందని స్టడీ మెటీరియల్.. వెరసి ఊహించని రీతిలో తల్లకిందులైన పది ఫలితాలు.. తారుమారైన ఇంటర్ అడ్మిషన్లు.. ఫలితం అడ్మిషన్ల లెక్క తప్పి.. ఇంటర్ విద్యాశాఖారులు తలలు పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీనిపై ప్రత్యేక కథనం.
● ఇంటర్ అడ్మిషన్లపై పది ఫలితాల దెబ్బ ● పాఠశాల విద్యను నిర్వీర్యం చేసిన కూటమి సర్కారు ● పదిపై దృష్టి సారించక 8 శాతం తగ్గిన ఫలితాలు ● జిల్లాలో పడిపోయిన ఇంటర్ అడ్మిషన్లు
తిరుపతి సిటీ: ఏడాదిగా ప్రాథమిక, ఉన్నతవిద్యపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో ఆ ప్రభావం ప్రస్తుతం ఇంటర్మీడియట్ అడ్మిషన్లపై పడింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది తిరుపతి జిల్లాలో పదో తరగతి ఫలితాలు 8 శాతం పడిపోయాయి. గత ఏడాది 75 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది కేవలం 67.06 శాతానికి పరిమితమయ్యాయి. దీంతో ఇంటర్మీడియట్ అడ్మిషన్లు దారుణంగా పడిపోవడంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఇంటర్ విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలోని పలు ప్రభుత్వ కళాశాలలో కనీసం సింగిల్ డిజిట్ అడ్మిషన్లు సైతం లేని కళాశాలలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అడ్మిషన్ల ప్రక్రియ గడువును పలుసార్లు పెంచుతున్నా మండల స్థాయిలోని హైస్కూల్ ప్లస్, మోడల్ స్కూళ్లలో ప్రవేశాలు ఒక్కటంటే ఒకటి కూడా జరగకపోవడం గమనార్హం. ఇందుకు ప్రధాన కారణం 2024–25 పదో తరగతి ఫలితాల దెబ్బేనని, ఇక ప్రవేశాలపై ఏమీ చేయలేమని అధికారులు నిర్మొహమాటంగా ప్రభుత్వానికి తేల్చిచెప్పినట్టు సమాచారం.
పాఠశాల విద్యను
నిర్వీర్యం చేసిన కూటమి సర్కార్
తిరుపతి జిల్లాలోని 33 మండలాల్లో 323 ఉన్నత పాఠశాలలు ఉండగా 2024–25 సంవత్సరంలో పదో తగరతి పరీక్షలకు 26,875 మంది విద్యార్థులు హాజరు కాగా, ఉత్తీర్ణులైన వారి సంఖ్య 20 వేలకు మించకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. జిల్లాలోని సుమారు 75 శాతం పాఠశాలల్లో గత ఏడాది పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపకుండా తూతూ మంత్రంగా పాఠ్యాంశాలు బోధించి వదిలేశారు. దీనికితోడు ఆశించిన రీతిలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందించలేకపోయారు. అలాగే ప్రధాన సబ్జెక్టులకు నిపుణులైన ఉపాధ్యాయుల కొరత సైతం ఫలితాలపై ప్రభావం చూపింది. విద్యాశాఖకాధికారులు పది విద్యార్థులను పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ ప్రభావం ఫలితాలపై చూపినట్లు విద్యావంతులు, నిపుణులు చర్చించుకుంటున్నారు.
4 వేల ప్రవేశాలపై ప్రభావం
జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కళాశాలలో నేటికీ సుమారు 4 వేల సీట్లు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూడు విడతలోనూ 20 శాతం అడ్మిషన్లకు నోచుకోలేదు. అలాగే హైస్కూల్ ప్లస్, మోడల్, ఏపీఆర్‌జేసీ, ట్రైబల్, ఏపీఎస్‌డబ్ల్యూఆర్ కళాశాలలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
కనీసం 25 శాతం అడ్మిషన్లు జరగకపోవడంతో విద్యాశాఖాధికారులు మరోసారి ఈనెలాఖరు వరకు అడ్మిషన్ల గడువును పెంచాల్సి వచ్చింది. అయినా ఇప్పటివరకు అన్ని ప్రభుత్వ కళాశాలలో సింగిల్ డిజిట్‌కు మించకపోవడం ఆశ్చర్యకరం. జిల్లాలో 109 ప్రైవేటు జూనియర్ కళాశాలు ఉండగా అందులో కేవలం 11 కళాశాలలో మాత్రమే ప్రవేశాలు 65 శాతం మేర జరిగాయి. మిగిలిన సాధారణ ప్రైవేటు కళాశాలలు మూత పడే పరిస్థితికి చేరుకుంటున్నాయి.
ఇంటర్మీడియట్ కళాశాలల్లో గత ఏడాది కంటే తగ్గిన అడ్మిషన్లు
4
వేలు
15 మంది కంటే తక్కువ
అడ్మిషన్లు కలిగిన కళాశాలలు
18
సింగిల్ డిజిట్ అడ్మిషన్ల కళాశాలలు
5
జిల్లాలో ఇంటర్మీడియట్ కళాశాలల వివరాలు
50 శాతం అడ్మిషన్లు పొందిన ప్రైవేటు కళాశాలలు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 21
ప్రైవేటు కళాశాలలు 109
హైస్కూల్ ప్లస్ 29
మోడల్ స్కూళ్లు 5
ఏపీఆర్‌జేసీ 1
ఎయిడెడ్ 1
ఏపీఎస్‌డబ్ల్యూఆర్ 10
ట్రైబల్ వెల్ఫేర్ 3
ఎంజేపీఏఆర్‌బీసీడబ్ల్యూఆర్ 2
15
25 శాతం కంటే తక్కువ ప్రవేశాలు పొందిన ప్రైవేటు కళాశాలలు
79
జిల్లా వివరాలు
2024–25లో పదోతరగతి పరీక్షలకు
హాజరైన విద్యార్థులు – 26,875
ఉత్తీర్ణులై విద్యార్థులు – 20,597
ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం – 79 శాతం
గత ఏడాది ఉత్తీర్ణత శాతం – 90.71
గత ఏడాది రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థానం – 10
గత ఏడాదితో పోలిస్తే తగ్గిన
ఉత్తీర్ణత శాతం – 10.88శాతం
ఈ ఏడాది రాష్ట్ర స్థాయిలో పది ఫలితాల్లో జిల్లా స్థానం – 19
ఉత్తమ ఫలితాలు సాధిస్తాం
గత ఏడాది కంటే 2025–26 సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తాం. పదో తరగతిపై ప్రత్యే క శ్రద్ధ చూపుతున్నాం. ఉపాధ్యాయుల కొరతను నివారించి అన్ని పాఠ్యాంశాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. పది విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, వచ్చే ఏడాది ఉత్తమ ఫలితాలు సాధిస్తాం.
–కేవీఎన్ కుమార్, డీఈఓ, తిరుపతి జిల్లా
నెలాఖరు వరకు అడ్మిషన్లకు గడువు
జిల్లాలోని జూనియర్ కళాశాలలో ప్రవేశాలు కాస్త మందకొడిగా ఉన్నాయి. దీంతో ఈ నెలాఖరు వరకు అడ్మిషన్ల గడువును ప్రభుత్వం పెంచింది. విద్యార్థులు ప్రభుత్వం ఎంసెట్ వంటి పోటీపరీక్షల మెటీరియల్స్‌ను, పుస్తకాలను, నోట్‌బుక్స్‌ను అందిస్తోంది. విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేరడం ఉత్తమం. తల్లిదండ్రులు సైతం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
– జి రాజశేఖర్‌రెడ్డి, ఆర్‌ఐఓ, తిరుపతి జిల్లా

అడ్మిషన్ల లెక్క తప్పింది!

అడ్మిషన్ల లెక్క తప్పింది!