
సంజాయిషీ ఇవ్వకపోతే విధుల నుంచి తొలగిస్తాం
తిరుపతిసిటీ: శ్రీకాళహస్తి మండలంలో వ్యా యామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఏ బాలకృష్ణ 2023 జనవరి 24వ తేదీ నుంచి నేటి వరకు విధులకు హాజరు కాకుండా అనుమతి తీసుకోకుండా వ్యవహరిస్తున్నారని డీఈఓ కేవీఎస్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విధుల గైర్హాజరుపై ఎంఈఓ ద్వారా తాఖీదు నోటీసు లు పోస్ట్ ద్వారా పంపామని తెలిపారు. కానీ ఆ ఉపాధ్యాయుడు ఆ నోటీసులను స్వీకరించకుండా కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. మూడు రోజుల్లోపు నోటీసులు స్వీకరించి, ఎంఈఓ కార్యాలయంలో హాజరై సంజాయిషీ ఇవ్వాలని, లేనిపక్షంలో విధుల నుంచి శాశ్వతంగా తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మరో ఇద్దరికి డెంగీ
సత్యవేడు: మండలంలోని ఏఎంపురంలో డెంగీ జ్వర పీడితుల సంఖ్య నాలుగుకు చేరడంతో రెండో రోజు దాసుకుప్పం వైద్యశాల సిబ్బంది వైద్యశిబిరం నిర్వహించారు. బుధవారం ఇద్దరికి డెంగీ సోకిన విషయం తెలిసిందే. కాగా గురువారం మరో రెండు కేసులు వెలుగు చూ శాయి. దీంతో సర్పంచ్ శిరీష ఆధ్వర్యంలో మలేరియా ఆఫీసర్ రూప్‌కుమార్, సబ్ యూ నిట్ అధికారి మోహన్, డాక్టర్ క్రిస్టల్‌దాస్, ఎంపీహెచ్‌ఈఓ గ్రామంలో పర్యటించి డెంగీ వ్యా ధిపై అవగాహన కల్పించారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో మలాఽథిన్ పిచికారీ చేశారు. డెంగీ జ్వర పీడితులు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తె లిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు శ్రీనివాసులు రెడ్డి, మాజీ సర్పంచ్ దా మోదర్ రెడ్డి, మునస్వామ యాదవ్, సాయికుమార్, ఢిల్లీబాబుయాదవ్ పాల్గొన్నారు.
19 నుంచి మూడు రోజులు
తపాలా సేవలు నిలిపివేత
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి డివిజన్ పరిధిలోని అన్ని తపాలా కార్యాలయాల్లో ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు ప్రజలకు సంబంధించిన అన్ని లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ మేనేజర్ సయ్యద్ తన్వీర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆధునిక సాంకేతిక ను జోడించి పోస్టల్ సేవా కార్యాకలాపాలను మరింత మెరుగైన, వేగవంతమైన, సురక్షితంగా ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ఏపీటీ అప్లికేషన్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. డేటా మైగ్రేషన్, వ్యవస్థ ధ్రువీకరణలు, కాన్ఫిగరేషన్ ప్రక్రియలను సజావుగా నిర్వహించేందుకు తాత్కాలికంగా సేవలను రద్దు చేస్తున్నామని, తిరిగి ఈ నెల 22వ తేదీ నుంచి మెరుగుపరిచిన వ్యవస్థతో సేవా కార్యక్రమాలను పునరుద్ధరించనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు దీనిని గుర్తించి తమకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
31 వరకే హాస్టల్ అడ్మిషన్లు
తిరుపతి అర్బన్: జిల్లాలోని బీసీ హా స్టల్స్‌లో ఈ నెల 31 వరకు మాత్రమే అ డ్మిషన్లు ఉంటాయని బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి భరత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్ నుంచి మాట్లాడుతూ హాస్టళ్లలో చేరడానికి ఆసక్తి ఉన్నవారు మీ పరిధిలోని బీసీ హాస్టళ్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 65 బీసీ హాస్టళ్లు ఉన్నా యని చెప్పారు. కొత్తగా చేర్చుకున్న విద్యార్థులతో కలిపి, ఇప్పటివరకు పాఠశాల, కళాశాల పరిధిలో 5,060 మంది విద్యార్థులున్నారని స్పష్టం చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. నిత్యం హాస్టళ్లపై నిఘా పెట్టా మని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీన జిల్లాలోని అన్ని హాస్టళ్లలో విద్యార్థులతో వార్డె న్లు సమావేశం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో విద్యార్థులు తాము ఉన్న హాస్టల్‌లో ఏదైనా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే వెంటనే వార్డెన్ దృష్టికి తీసుకుపోతే వాటికి పరిష్కారం చూపించే దిశగా చర్యలు ఉంటాయని చెప్పారు.
సర్వ దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లన్నీ నిండాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 75,104 మంది స్వామివారిని దర్శించుకోగా 31,896 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.66 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది.