
అయ్యో.. అన్నంత పనీ చేసేశారు..!
● ఏఎన్‌ఎం అన్నపూర్ణ రామకుప్పంకు బదిలీ ● ఆ ఏఎన్‌ఎంపై ఎమ్మెల్యే నానికి ఎందుకంత కక్ష ? ● నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేసిన డీఎంహెచ్‌ఓ
సాక్షి, టాస్క్‌ఫోర్స్: అయ్యో.. అన్నంత పనీ చేసేశారు.. అందరికీ ఆరోగ్య సేవలు అందించే ఆ ఏఎన్‌ఎంపై ఎందుకు పగబట్టారు..? ఆమె చేసిన తప్పు ఏమిటో చెప్పలేదు..? ఆ విషయంలో జిల్లా అధికారులు కూడా స్పష్టత ఇవ్వలేదు.. ఏదైతేనేం.. వారు అనుకున్నట్టుగానే ఆ ఏఎన్‌ఎంను కుప్పం నియోజకవర్గంలోని రా మకుప్పంకు బదిలీ చేసేశారు. చంద్రగిరి మండలం మిట్టపాళెం గ్రామ సచివాలయంలో ఏఎన్‌ఎంగా విధు లు నిర్వహిస్తున్న గట్టు అన్నపూర్ణ పదిమందికీ వైద్య సేవలు అందిచడంలో చాలా చురుగ్గా పనిచేస్తుంటా రు. ఆమె భర్త మైకేల్ ఆర్టీసీలో ఉద్యోగి. వీరిద్దరూ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు కావడంతో స్థానిక ఎ మ్మెల్యే పులివర్తి నాని పగబట్టారు. ఇటీవల జరిగిన ఏఎన్‌ఎంల బదిలీల్లో అన్నపూర్ణను చంద్రగిరి మండ లం నుంచి కుప్పం నియోజకవర్గానికి బదిలీ చేయా లని డీఎంహెచ్‌ఓ సుధారాణిపై ఒత్తిడి తెచ్చారు. అయి తే ఏఎన్‌ఎంల బదిలీ ఉత్తర్వులు ప్రకారం ఆమెను అంత దూరం బదిలీ చేయడానికి అవకాశం లేదన్న విషయాన్ని ఎమ్మెల్యే నానికి డీఎంహెచ్‌ఓ సుధారాణి తెలియపరిచినప్పటికీ పరిపాలనా సౌలభ్యం కింద ఆమె ను కుప్పంకు బదిలీ చేయాల్సిందేనని పట్టుబట్టినట్టు సమాచారం. అదే విషయాన్ని డీఎంహెచ్‌ఓ ఏఎన్‌ఎం అన్నపూర్ణను పిలిచి చెప్పడంతో పాటు ఎమ్మెల్యే నానిని కలసి ఆయన వద్దనుంచి వద్దని చెప్పిస్తే తప్ప తాను ఏమీ చేయలేనని కూడా వివరించారు. ఎమ్మెల్యే నాని ఏఎన్‌ఎం బదిలీకి లక్ష రూపాయలు అడిగితే ఇవ్వనందుకు తనపై కక్ష కట్టి కుప్పానికి బదిలీ చేయమన్నారని ఏఎన్‌ఎం అన్నపూర్ణ గత నాలుగు రోజుల క్రితం మీడియాకు వివరించారు. దీంతో ఆమైపె మరింత కక్ష పెంచుకున్న ఎమ్మెల్యే నాని జనసంచారం తక్కువగా ఉండే అటవీ ప్రాంతానికి బదిలీ చేయాలని డీఎంహెచ్‌ఓకు మరోసారి ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. చివరకు జిల్లా అధికారులు ఏఎన్‌ఎం అన్నపూర్ణను తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నుంచి చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం 89 పెద్దూరు (అటవీ ప్రాంతం)కు బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ఏఎన్‌ఎం అన్నపూర్ణపై కక్ష కట్టిన ఎమ్మెల్యే నాని తన పంతం నెగ్గించుకోవడం పట్ల ఉద్యోగసంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
మహిళా ఉద్యోగిపై అంత కక్ష ఎందుకో..?
ఒక మహిళా ఉద్యోగిని పట్ల ఎమ్మెల్యే నాని కక్ష కట్టడంపై స్థానికంగా మహిళా ఉద్యోగుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలే ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న అన్నపూర్ణ పట్ల ఎమ్మెల్యే నాని, జిల్లా అధికారులు అనుసరించిన తీరు సరిలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏఎన్‌ఎంల బదిలీల్లో అడ్డగోలుగా వ్యవహరించారనడానికి చంద్రగిరి మండలంలో పనిచేసే పలువురు ఏఎన్‌ఎంలకు అదే మండలంలో పోస్టింగ్‌లు ఇవ్వడమే నిదర్శనమని అన్నపూర్ణ భర్త మైఖేల్ ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు.