
నిమ్మ ధరలు పతనం
● చెట్లు నరికివేస్తున్న రైతులు ● ధరలు తగ్గడంతో సాగు కష్టంగా మారిందంటున్న రైతులు
ధరలు తగ్గుముఖం పట్టాయి
నిమ్మ కాయలకు ఢిల్లీ మార్కెట్‌లో ధరలు లేకపోవడంతో ఇక్కడ కూడా ధరలు తగ్గించేస్తున్నారు. మూడు డిక్కీలు(150 కిలోలు) నిమ్మ కాయలు కోసుకుని మార్కెట్‌కు వస్తే ఖర్చు రూ.700 అయ్యింది. మార్కెట్‌లో నిమ్మ కా యలు విక్రయిస్తే రూ.1,600 వచ్చింది. ఖ ర్చులు పోనూ ఇక మిగిలేది ఏముంది? ఇలా అయితే నిమ్మ సాగుకు అవసరమైన పురుగు మందులు కొనుగోలు ఎలా చేయగలం.. కు టుంబాలను ఎలా పోషించుకోగలం?
– చిల్లకూరు వేమయ్య, చిల్లకూరు, తిరుపతి జిల్లా
కాయలు తోటలోనే వదిలేస్తున్నా
పది ఎకరాల్లో నిమ్మ సాగుచేస్తున్నాను. ప్రస్తు తం కాపు బాగానే ఉన్నా మార్కెట్‌లో ధరలు లేకుండా పోయాయి. దీంతో అటు గూడూరుకు గానీ, ఇటు నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మార్కెట్‌కు గానీ కాయలు కోసి లోడ్ ఎత్తుకుని పోతే అక్కడ ధరలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. గత ఏడాది ఇదే సీజన్‌లో కిలో రూ.50 నుంచి రూ.60 వరకు ధర పలికింది. ఇప్పడు కిలో రూ.5 నుంచి రూ.20 పలుకుతోంది. దీంతో ఖర్చులు కూడా రావని కాయలు తోటలోనే అలాగే వదిలేస్తున్నా.
– దామోదరరాజు, రాజుల ఎరుగుంటపాళెం,
సైదాపురం మండలం,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
చిల్లకూరు: మొన్న వరి, పొగాకు, పసుపు, రొయ్యలు, మామిడి, ఇప్పడు నిమ్మ ఇలా రైతులు ఏ పంట పండించినా వాటికి గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలం అవుతోంది. దీంతో రైతుల పంట సాగు చేసేందుకు సతమతమవుతున్నారు. కూటమి ప్ర భుత్వం రైతులకు అండగా ఉంటామని చెబుతూ కాలయాపన చేస్తోంది. దీంతో దిగుబడులకు మద్దతు ధర లు లేక రైతులు డీలా పడుతున్నారు. మొన్నటికి మొన్న తోతాపురి మామిడి కాయలకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో చిత్తూరు జిల్లాలో రైతులు రోడ్డుపై కాయలను పారబోసి, ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చే శారు. అలాంటి స్థితి నేడు తిరుపతి జిల్లాలోని నిమ్మ రైతుల్లో నెలకొంది. నెల రోజులుగా దిగుబడులు బాగా నే వస్తున్నప్పటికీ ఎగుమతులు లేకపోవడంతో ధరలు అమాంతం పడి పోయాయి. గత ఏడాది ఇదే సీజన్‌లో కిలో నిమ్మ కాయలు రూ.50 నుంచి రూ.60 వరకు పలికింది. నేడు ఆ ధర పదింతలు దిగజారి పోయి రూ.5 నుంచి రూ.25 పలుకుతోంది. దీంతో రైతులు తమ తోటల్లో కాసిన నిమ్మ కాయలను కోసి మార్కెట్‌కు తరలించలేకపోతున్నారు. అలాగే మార్కెట్ నుంచి కూడా ఢిల్లీ ప్రాంతంలోకి ఎగుమతులు నిలిచిపోయాయి.
వాతావరణంలో మార్పులు
ఎండలు విపరీతంగా ఉండాల్సిన సమయంలో అప్పుడప్పుడు వర్షాలు పడడంతో నిమ్మ చెట్టుకు బలం వ చ్చింది. దీంతో పూత పూసి కాపునకు వచ్చింది. అయితే వర్షాలు పూర్తిగా నిలిచిపోయి ఎండలు ముదిరి పోవడంతో పూత రాలిపోవడం మొదలు పెట్టింది. దీనిని కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. తీరా పూత నిలిచి కాయలు కాసే స మయానికి నాణ్యత దెబ్బతినింది. ఈ కారణంతో ఢిల్లీ కి ఎగుమతులు ఇటీవల కాలంలో పూర్తిగా నిలిచిపోయింది. ఎగుమతులు లేక పోవడంతో మార్కెట్ లోని వ్యాపారులు ధరలు అమాంతం తగ్గించేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఎగుమతులు జరిగే ప్రాంతాలివే..
నిమ్మ మార్కెట్ బాగా ఉండే సమయంలో గుజరా త్, పూణే, ముంబయి, బెంగళూరు, చైన్నె, కోల్‌క తా, సూరత్, ఢిల్లీ మార్కెట్లకు ప్రతిరోజూ కనీసం రెండు లారీలు(ఒక లారీ 22 టన్నులు) ఎగుమతులు జరిగేవి. నేడు ధరలు లేక రైతులు మార్కెట్‌కు కాయలు తీసుకుని వచ్చేందుకు కూడా ముందుకు రావడం లేదు.
ధరలు లేక నరికేస్తున్న నిమ్మ చెట్లు
తిరుపతి జిల్లాలో నిమ్మ పరిశోధన స్థానం ఉన్నప్పటికీ వారు చేసే పరిశోధనలతో కొత్త వంగడా లను సృష్టించి రైతులకు అందిస్తున్నారు. ఇవి దిగుబడి బాగా ఇస్తున్నప్పటికీ వాటికి మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలం అవుతోంది. దీంతో తిరుపతి జిల్లాలో నిమ్మ సాగు చే పట్టే గూడూరు, ఓజిలి, చిల్లకూరు మండలాలతో పాటు సమీపంలో ఉన్న నెల్లూరు జిల్లా సైదాపు రం మండలంలోనూ సాగు చేపట్టిన నిమ్మ చెట్లను కొంతమంది రైతులు నరికివేసి భూములు చదు ను చేస్తున్నారు.
తిరుపతి జిల్లాలో నిమ్మ సాగు విస్తీర్ణం
15 వేల హెక్టార్లు
ప్రతిరోజూ దిగుబడి సుమారు
400 టన్నులు
ప్రతిరోజూ గూడూరు మార్కెట్ నుంచి ఎగుమతి
308 టన్నులు
కొనుగోలు చేయని సిట్రస్ పరిశ్రమలు
తిరుపతి జిల్లాలో నిమ్మరసం తీసి విక్రయించుకు నే సిట్రస్ పరిశ్రమలు పెద్దగా లేవు. ఉన్న రెండు, మూడు పరిశ్రమల కూడా తగిన మద్దతు ధర ఇ చ్చి కాయలు కొనుగోలు చేయక పోవడంతో రైతులకు అటు వైపు నుంచి కూడా పూర్తిస్థాయి మద్దతు లేకుండా పోతోంది. స్థానికంగా పండించే పంటకు అనువుగా ఉండే పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఆయా పంటలు సాగు చేసే రైతులకు కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు ఉంటుంది.

నిమ్మ ధరలు పతనం

నిమ్మ ధరలు పతనం

నిమ్మ ధరలు పతనం

నిమ్మ ధరలు పతనం

నిమ్మ ధరలు పతనం