
స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు దక్కడం శుభపరిణామం
తిరుపతి తుడా: తిరు నగరి వరుసగా నాలుగోసారి స్వచ్ఛసర్వేక్షన్ అవార్డు కైవసం చేసు కోవడం శుభపరిణా మమని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష ఆనందం వ్యక్తం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న విప్లవాత్మక సంస్కరణల ఫలితమే ఈ అవార్డు దక్కడానికి ప్ర ధాన కారణమన్నారు. స్వచ్ఛసర్వేక్షన్ లీగ్ సిటీస్ విభాగంలో తిరుపతికి ఈ అవార్డు దక్కిందన్నా రు. ఇందుకోసం బుధవారం ఢిల్లీకి పయనమవుతున్నట్లు చెప్పారు. గురువారం ఢిల్లీ విద్యాభవన్ వేదికగా జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డును అందుకోనున్నామని తెలిపారు. ఈ అవార్డుతో న గరపాలక సంస్థ యంత్రాంగం మరింత బాధ్యత గా పనిచేసి దేశంలోనే నంబర్ వన్ సిటీగా తి రుపతి నిలిచేలా కృషి చేయాలన్నారు.
రేపటితో ముగియనున్న
వెబ్ ఆప్షన్లు
తిరుపతి సిటీ: ఏపీఈఏపీసెట్–2025కు సంబంధించి ఇంజినీరింగ్ వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. ఈనెల 13వ తేదీ నుంచి కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇప్పటి కే జిల్లాలో సుమారు 19 వేల మందికిపైగా వెబ్‌ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేశారు. మరో రోజు మాత్రమే వెబ్‌ఆప్షన్లకు అవకాశం ఉండడంతో విద్యార్థులు అప్రమత్తం కావాలని అధికారులు సూచిస్తున్నారు. ఈనెల 19వ తేదీన ఒక రోజు మాత్రమే వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉండనుంది. 22 వతేదీన సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి కానుంది. అలాగే ఐసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రి య గురువారం ప్రారంభమైంది. ఈనెల 21వ తేదీవరకు ఆప్షన్ల ఎంపికకు అవకాశం ఇచ్చిన అధికారులు, 22న వెబ్ ఆప్షన్ల మార్పు, 25న సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు.
గ్రామస్థాయిలో
క్షయ నివారణకు కృషి
తిరుపతి రూరల్ : గ్రామ స్థాయిలో క్షయ (టీబీ) నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాతీ య క్షయ నివారణ విభాగం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ భవానీసింగ్ కుష్వా సూచించారు. తిరు పతి రూరల్ మండలం వెంకటపతినగర్ పంచాయతీలో బుధవారం జాతీయ క్షయ నివారణ కేంద్రం తరపున ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధితో బాధపడుతున్న వారు సకాలంలో వైద్య సేవలు తీసుకుంటే ప్రాణాలతో బయటపడవచ్చన్నారు. ముఖ్యంగా క్షయ కారణాలు, లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి సర్పంచ్ బాధ్యతగా తీసుకుని తరచూ అవగాహనా సదస్సులు నిర్వహించాలన్నారు. క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు అన్ని ప్రభు త్వ ఆస్పత్రుల్లో ఉచితంగా చేస్తున్నారని, సర్పంచ్ చిన్నియాదవ్, ధర్మారావు, గంగాధర్‌దాస్, డాక్టర్ ధీరజ్, డాక్టర్ శైలజ, డాక్టర్ ఉదయశ్రీ, ధనలక్ష్మి, అంజనాబాయి పాల్గొన్నారు.

స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు దక్కడం శుభపరిణామం