
మాకు అందలేదు
నా కుమార్తె నజీరా 5వ తరగతి చదువుతోంది. మాకు తల్లికి వందనం నగదు అందలేదు. దీంతో విద్యాశాఖాధికారులను సంప్రందించాం. సచివాలయానికి వెళ్లాలని చెప్పారు. అక్కడికెళితే తమకు సంబంధం లేదని చెబుతున్నారు. రెక్కాడితేకానీ డొక్కనిండని బతుకులు మావి. ఇలా కార్యాలయాల చుట్టూ తిరగలేకపోతున్నాం. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు.
– ధనమ్మ, విద్యార్థిని తల్లి, కేవీబీపురం మండలం
ఇద్దరికి రూ.17వేలు వేశారు
నాకు కవలపిల్లలు. జోషిత్తు, జీవన్ 8వ తరగతి చదువుతున్నారు. అయితే తల్లికి వందనం పథకం కింద ఇద్దరు బిడ్డలకు రూ.30 వేలు రావాల్సి ఉంది. అయితే ఒక్కొక్కరికి రూ.8,500 చొప్పున 17వేలు మాత్రమే వేశారు. ఈ విషయాన్ని విద్యాశాఖాధికారులకు తెలియజేశాం. 20 రోజులుగా మండల ఆఫీస్‌కి తిరుగుతున్నాం. అయినా ప్రయోజనం లేదు. – మోరా ప్రసూన,
కమ్మవారి పాళెం, చిల్లకూరు మండలం
సమాధానం లేదు
పేద కుటుంబానికి చెందిన వాళ్లం. అయితే మాకు తల్లికి వందనం రాలేదు. మా కుమార్తె కుందన ఒకటో తరగతి చదువుతోంది. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. ఆ హామీ మేరకు ఇవ్వాలని కోరుతున్నాం. అసలు మాకు ఎందుకు ఇవ్వలేదో ఎవరికీ తెలియదట. అసలు సమాధానం చెప్పేవారే లేరు. – బోడిరెడ్డి నాగవేణి,
నెమళ్లగుంటపల్లె, రామచంద్రాపురం మండలం

మాకు అందలేదు

మాకు అందలేదు