
వెలుగులో చీడపై మహిళల కన్నెర్ర
● బ్యాంకు వద్ద ఆందోళనకు దిగిన డ్వాక్రా మహిళలు ● వైఎస్సార్ సీపీ నేత భూమన అభినయ్‌రెడ్డి మద్దతు
తిరుపతి తుడా:వెలుగులో చీడ పురుగులుగా మారిన సిబ్బందిపై డ్వాక్రా సంఘాల మహిళలు కన్నెర్ర చేశారు. తమ నగదుకు భద్రత కరువడంతో సభ్యులు రోడ్డెక్కారు. ఆర్పీ హే మలత రూ.70 లక్షలు స్వాహా చేయడం వె నుక దాగి ఉన్న మెప్మా అధికారులు, బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని గళమెత్తారు. ఆర్పీ ద్వారా మోసపోయిన పలు డ్వాక్రా సంఘాల మహిళలు లింగేశ్వరనగర్ లోని ఇండియన్ బ్యాంకు వద్దకు చేరుకుని సోమవారం ఆందోళనకు దిగారు. మహిళ లు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో అధికారు లు బ్యాంకు గేటుకు తాళాలు వేశారు. దీంతో ఆగ్రహించిన మహిళలు గేటు విరగ్గొట్టి లోపలికి చొచ్చుకెళ్లారు. రిసోర్స్ పర్సన్ హేమలత అవినీతి అక్రమాల్లో బ్యాంక్ సిబ్బంది ప్రమే యం ఉందని నిలదీశారు. బ్యాంకు మేనేజర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళ సంఘాల సభ్యులకు మద్దతుగా వైఎస్సార్ సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డితోపాటు, ఆ పార్టీ నాయకులు, సీపీఐ నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. విషయం పెద్దది కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. బ్యాంకు నుంచి బయటికి వెళ్లాలని కోరారు. దీంతో మహిళలు బ్యాంకు నుంచి బయటకు వచ్చారు. సంబంధిత బ్యాంకు మేనేజర్ మహిళలకు వివరణ ఇచ్చారు. అప్పటికీ మహిళలు వెనక్కి తగ్గకపోవడంతో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయాలని పోలీసులు మహిళలను కోరారు. దీంతో ఆర్పీ హేమలతతోపాటు బ్యాంక్ సిబ్బందిపై డ్వాక్రా సంఘాల సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నగదు స్వాహా విధానం ఆశ్చర్యం
డ్వాక్రా సంఘాల నగదును కాజేసిన విధా నం ఆశ్చర్యం కలిగిస్తోందని వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ రెడ్డి అన్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలకు భూమన అభి నయ్ మద్దతుగా నిలిచి ఆందోళనలో పా ల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తిరుపతి నియోజకవర్గంలో 44 వేల మందికి పైగా డ్వాక్రా సంఘాల సభ్యులు ఉన్నారన్నారు. వారి డబ్బులు ఏమాత్రం భద్రమో తేల్చా లన్నారు. డ్వాక్రా సంఘాల నగదుపై ఆడి ట్ నిర్వహించి మహిళల్లో నెలకొన్న ఆందోళను తొలగించాల్సిన బాధ్యత మెప్మా అధికారులదేనన్నారు. ఎస్‌ఎల్‌ఎఫ్ పరిధి లో సభ్యులందరి సమక్షంలో ఆడిట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన ఆర్పీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. టీఎల్‌ఎఫ్, ఎస్‌ఎల్‌ఎఫ్‌లపై లోతైన విచారణ జరిపితేనే నిజాలు వెలుగు చూస్తాయన్నారు.డ్వాక్రా సంఘాల పొదుపు ఇతర రుణాలను కాజేసిన ఆర్పి హేమలతపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. సీపీఐ నేతలు పెంచల య్య, విశ్వనాథ్, రాధాకృష్ణ పాల్గొన్నారు.

వెలుగులో చీడపై మహిళల కన్నెర్ర