
వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్‌కు ఎంపిక పోటీలకు 16 మంది
తిరుపతి ఎడ్యుకేషన్ : కడపలోని డాక్టర్ వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్ 4, 5వ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 11, 14వ తేదీల్లో తిరుపతిలోని ఎస్వీయూ స్టేడియంలో ఎంపిక పోటీలను నిర్వహించారు. తిరుపతి జిల్లాలోని వివిధ మండలాల నుంచి హాజరైన 16 మంది చిన్నారులకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శశిధర్, డీఎస్‌ఏ కోచ్‌ల ఆధ్వర్యంలో ఆరు రకాల ఈవెంట్లలో పరీక్షలు నిర్వహించారు. అలాగే వీ రందరికి వైద్య బృందం ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను శాప్‌కు పంపించినట్లు డీఎస్‌డీఓ తెలిపారు. ఈ జాబితాను పరిశీలించి ఎంపిక చేసిన అభ్యర్థుల వివరాలను త్వరలో ఆన్‌లైన్‌లో శాప్ ప్రకటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
నేటి నుంచి లెక్చరర్ పోస్టుల భర్తీకి పరీక్షలు
తిరుపతి అర్బన్: ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో లెక్చరర్ పోస్టుల భర్తీకి మంగళవారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకు జిల్లాలోని ఆరు కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నట్లు డీఆర్వో నరసింహులు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ తిరుపతి జిల్లాలో ఆరు పరీక్ష కేంద్రాల్లో జరగనున్న లెక్చరర్ పో స్టుల పరీక్షలకు 6,412 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయని, పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు పక్కాగా ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్, ఎల క్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వాచ్‌లు, వైర్‌లెస్ హెడ్ సెట్స్, తదితర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఉండదన్నారు. జిల్లాలో పుత్తూరు సి ద్ధార్థ, రేణిగుంట రోడ్డులోని చదలవాడ రమణ మ్మ ఇంజినీరింగ్ కళాశాల, తిరుపతి జూపార్క్ వద్ద ఉన్న అయాన్ డిజిటల్ సెంటర్, గూ డూరులోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాల, కోట మండలం విద్యానగర్‌లోని ఎన్‌బీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాలతోపాటు ఎన్‌బీకేఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందే హాజరు కావాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని తెలిపారు.

వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్‌కు ఎంపిక పోటీలకు 16 మంది