కర్షకులపై కర్కశమా? | - | Sakshi
Sakshi News home page

కర్షకులపై కర్కశమా?

Jul 12 2025 7:01 AM | Updated on Jul 12 2025 11:11 AM

కర్షక

కర్షకులపై కర్కశమా?

కూటమి ప్రభుత్వం రైతులను కట్టడి చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ పర్యటనకు వెళ్లకుండా అడ్డుకట్టలు వేసింది. పోలీసులతో నిలువరించింది. తెల్లచొక్కా, రైతు కండువ కనిపిస్తే చాలు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తమ సమస్యను మాజీ ముఖ్యమంత్రికి చెప్పుకోవాలని వెళితే తప్పా..? సమస్యలు చెప్పుకుందామని నడుచుకుని వచ్చాం. అడ్డదారులో చేరాం. రాళ్లురప్పలను లెక్క చేయలేదు. మాజీ ముఖ్యమంత్రి చెంత మామిడి కష్టాలను కన్నీళ్లతో వెలిబుచ్చాం. కర్షకులపై ఇంత కర్కశం పనికిరాదు.

– వెంకటరెడ్డి, రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు

శత్రువులా చూశారు

జగన్‌మోహన్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అండి. ఆయనొస్తే..వీళ్లకెందుకు నొప్పి. కూటమి ప్రభుత్వం ప్రజాధరణతోనే గెలిచింది కదా. అలాంటప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి వచ్చి వెళితే మీకేంటి?.. దానికి ఇంత రాద్ధాంతం చేయలా..?. ఇంతటి దౌర్జన్యం చేసినా రైతులు గుండెనిండా అభిమానంతో జగన్‌మోహన్‌రెడ్డిని కలవాలని వచ్చారు. ఆ అభిమానాన్ని ఎవరూ ఆపలేరు. పోలీసులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రైతులను శత్రువులను చూసినట్లు చూశారు.

– పద్మనాభరెడ్డి, రైతు నాయకులు

కర్షకులపై కర్కశమా? 
1
1/2

కర్షకులపై కర్కశమా?

కర్షకులపై కర్కశమా? 
2
2/2

కర్షకులపై కర్కశమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement