
మేత పొరంబోకు భూములను పరిశ్రమలకు ఇవ్వొద్దు
చిల్లకూరు : మేత పొరంబోకు భూములను పరిశ్రమలకు ఇవ్వొద్దని గూడూరు మండలం మేకనూరు గ్రామస్తులు శుక్రవారం సర్వే చేపట్టేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. మేకనూరు గ్రామానికి సమీపంలో సర్వే నంబర్ 1లో సుమారు 240 ఎకరాల మేత పొరంబోకు భూములు ఉన్నాయి. వీటిని పరిశ్రమల కోసం కేటాయించేందుకు అధికారులు ఇన్‌చార్జ్ తహసీల్దార్ ప్రసాద్, ఆర్‌ఐ చైతన్యతో పాటుగా సిబ్బంది భూముల వద్దకు చేరుకోవడంతో గ్రామస్తులు అక్కడకు చేరుకుని అధికారులను అడ్డుకుని వాగ్వివాదానికి దిగారు. ప్రస్తుతం జరిగిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని అధికారులు తెలిపారు. దీనిపై గ్రామస్తులు కూడా సోమవారం కలెక్టర్‌ను కలిసి వినతులు అందజేస్తామని గ్రామస్తులు తెలిపారు.