ఫ్రెండ్లీ పోలీిసింగ్‌తో ప్రజలకు దగ్గరవ్వండి

మాట్లాడుతున్న తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి  - Sakshi

వరదయ్యపాళెం: ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు దగ్గర కావాలని ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం శ్రీసిటీలో గూడూరు, నాయుడుపేట, శ్రీసిటీ సబ్‌ డివిజన్ల పోలీసు అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నేరాలు, శాంతిభద్రతలు, విజిలెన్స్‌పై ఎస్పీ సమీక్ష జరిపారు. ఆయా ప్రాంతాల్లో నేర నిరోధక తనిఖీలు నిర్వహించాలని, వివిధ ముఠాల చుట్టూ ఉచ్చు బిగించాలని, పెండింగ్‌లో ఉన్న కేసులు, తాజా ఫిర్యాదులు, విచారణలు, నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు, నోటీసులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించారు. వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై సకాలంలో కోర్టు ఆదేశాలు అమలయ్యేలా, నోటీసులు అందేలా చూడాలన్నారు. ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై అధికారులకు సూచనలు చేస్తూ ఫిర్యాదులతో పోలీస్‌ స్టేషన్లకు వచ్చే వారితో మంచిగా ప్రవర్తించాలని కోరారు. ఏఎస్పీలు వెంకటరావు (అడ్మిన్‌), బీహెచ్‌ విమలకుమారి(నేర విభాగం), డీఎస్పీలు సురేంద్ర రెడ్డి (స్పెషల్‌ బ్రాంచ్‌), జగదీష్‌ నాయక్‌ (శ్రీసిటీ), పలువురు సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Read latest Tirupati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top