రేపు అండర్‌–17 జిల్లా స్థాయి చెస్‌ పోటీలు

తిరుపతి ఎడ్యుకేషన్‌ : తిరుపతి జిల్లా స్థాయి అండర్‌–17 బాలబాలికల చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ఈ నెల 26వ తేదీన గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాలల నిర్వహించనున్నారు. ఆ మేరకు చీఫ్‌ ఆర్బిటర్‌ శ్రీనివాస్‌ సూరి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పోటీల్లో మొదటి రెండు స్థానాలు సాధించిన బాలబాలికలను రాష్ట్ర స్థాయి అండర్‌–17 ఫెడ్‌ రేటింగ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌కు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. 2006, జనవరి 1వ తేదీ తరువాత జన్మించిన వారు ఈ పోటీలకు అర్హులని, పాల్గొనదలచిన వారు శ్ఙ్రీడబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఏపీసీహెచ్‌ఈఎస్‌ఎస్‌.ఓఆర్‌జీశ్రీ వెబ్‌సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 98852 38474 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు.

Read latest Tirupati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top