టుడే హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

Today Morning News Headlines (9-1-2021) - Sakshi

ప్రజా సంకల్ప యాత్ర తుది ఘట్టానికి రెండేళ్లు
జనం గుండె చప్పుడు వింటూ.. దగా పడ్డ ప్రజల కన్నీళ్లు తుడుస్తూ.. నేటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సాగించిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తయి నేటికి రెండేళ్లు. తెలుగుదేశం కర్కశ పాలనలో బరువెక్కిన హృదయ ఘోష వింటానంటూ.. పేదల పక్షాన నేనున్నానంటూ వైఎస్‌ జగన్‌ 2017 నవంబర్‌ 6వ తేదీన వరుణ దేవుడు ఆశీర్వదించగా ఇడుపులపాయ నుంచి తొలి అడుగు వేశారు. పూర్తి వివరాలు..


గెలిచి పదవులు కోల్పోయింది 3,522 మంది! 

ఎన్నికల్లో గెలిచామనే ఆనందంలో కొందరు.. ఓడిపోయిన నిస్పృహలో మరికొందరు.. తెలిసి కొందరు.. తెలియక ఇంకొందరు.. నిర్లక్ష్యంతోనో మరో కారణం చేతనో చేసిన పని ఇప్పుడు వారిపాలిట శాపంగా మారింది. ఎన్నికల వ్యయం వివరాలు సమర్పించనందకు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా దాదాపు 40వేల మందిపై అనర్హత వేటు పడింది. ఇందులో కొందరు పదవులు సైతం కోల్పోయి లబోదిబోమంటున్నారు.. ఇదండీ 2019 స్థానిక సంస్థల్లో పోటీ చేసి ఎన్నికల వివరాలు ఈసీకి సమర్పించని వారి సంగతి.  పూర్తి వివరాలు..

పుదుచ్చేరి జిల్లా కలెక్టర్‌పై విష ప్రయోగం?

పుదుచ్చేరి జిల్లా కలెక్టర్‌ పూర్వ గార్గ్‌పై విష ప్రయోగం జరిగిందన్న అభియోగాలతో సీబీ–సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ వైఖరిని వ్యతిరేకిస్తూ సీఎం నారాయణస్వామి నేతృత్వంలో శుక్రవారం రాజ్‌నివాస్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమం బందోబస్తు ఏర్పాట్లపై చర్చించేందుకు కలెక్టరేట్‌లో అధికారులు గురువారం సమావేశమయ్యారు. పూర్తి వివరాలు..

ట్రంప్‌ స్వీయ క్షమాభిక్ష..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదవి వీడే ముందు మరో అనూహ్య నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్యాపిటల్‌ భవనంపై దాడికి మద్దతుదారులను ప్రోత్సహించి ప్రపంచ దేశాల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న ట్రంప్‌ తనని తాను క్షమించుకునే అవకాశాల గురించి యోచిస్తున్నారు. జనవరి 20కి ముందే ట్రంప్‌ని గద్దె దింపేయాలని కాంగ్రెస్‌ సభ్యుల నుంచి డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో స్వీయ క్షమాభిక్షకి గల సాధ్యా«సాధ్యాలపై  సలహాదారులతో సంప్రదిస్తున్నట్టుగా అమెరికా మీడియా అంటోంది. పూర్తి వివరాలు..


లోన్‌ యాప్‌ వేధింపులకు యువకుడు బలి

లోన్‌యాప్‌ నిర్వాహకుల వేధింపులు భరించలేక యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గాలిపల్లికి చెందిన మల్లుగారి పవన్‌కళ్యాణ్‌రెడ్డి (22) కరీంనగర్‌లో డిగ్రీ పూర్తిచేసి ఇంట్లోనే ఉంటున్నాడు. వ్యక్తిగత అవసరాలకు ఇటీవల ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ ద్వారా రుణం తీసుకున్నాడు. పూర్తి వివరాలు..​​​​​​​


ఎదురుదెబ్బ: ఎన్డీయేలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!

ఆపరేషన్‌ ఆకర్శ్‌, మిత్రపక్ష ఒత్తిళ్ళతో బిహార్‌ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ, జీతన్‌ రాం మాంఝీ నేతృత్వంలోని హిందూస్థానీ అవామ్‌ మోర్చాలు ఈసారి రాజకీయ దుమారాలకు వేదికగా నిలవనున్నాయి. చాలా మంది ఆర్జేడీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని జేడీయూ నేతలు తరుచూ చేస్తున్న వ్యాఖ్యలకు ఒక కాంగ్రెస్‌ నేత మరింత బలాన్ని చేకూర్చారు. పూర్తి వివరాలు..​​​​​​​

నటి రాధికపై సీసీబీ ప్రశ్నల వర్షం

అక్రమ నగదు బదిలీ ఆరోపణపై నోటీసు అందుకున్న నటి రాధిక కుమార స్వామి శుక్రవారం సీసీబీ ముందు హాజరయ్యారు. ఉదయం తన సోదరుడు రవిరాజ్‌తో పాటు చామరాజపేటలోని సీసీబీ కార్యాలయానికి వచ్చిన ఆమెపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. నిందితుడు యువరాజ్‌ అకౌంట్‌ నుండి పెద్దమొత్తంలో నగదు బదిలీపై రాధిక వివరణ ఇచ్చారు.  పూర్తి వివరాలు..​​​​​​​


ఆ చేతికి తిరుగు లేదు!​​​​​​​

ఆల్‌రౌండర్‌గా తానేమిటో మళ్లీ మళ్లీ నిరూపించుకుంటున్న రవీంద్ర జడేజా శుక్రవారం మరోసారి తన ‘మూడో కన్ను’ తెరిచాడు. ఆసీస్‌ పటిష్ట స్థితిలో రోజును ప్రారంభించిన తర్వాత 4 వికెట్లతో సత్తా చాటిన అతను ఇన్నింగ్స్‌ చివరి బంతికీ తన ముద్ర చూపించాడు. బుమ్రా బంతిని స్క్వేర్‌ లెగ్‌ దిశగా ఆడిన స్మిత్‌ రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే జడేజా మెరుపు వేగం ముందు అది సాధ్యం కాలేదు.  పూర్తి వివరాలు..​​​​​​​

ట్రంప్‌నకు ట్విటర్‌ శాశ్వత చెక్‌- ఫేస్‌బుక్‌ సైతం!

ప్రస్తుత అమెరికన్‌ ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్‌ చేస్తున్నట్లు సోషల్‌ మీడియా దిగ్గజం ట్విటర్‌ తాజాగా పేర్కొంది. రెండు రోజుల క్రితం క్యాపిటల్‌ బిల్డింగ్‌పై జరిగిన హింసాత్మక దాడులను ప్రోత్సహించే విధంగా ఇటీవల ట్రంప్‌ చేసిన ట్వీట్స్‌ నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు ట్విటర్‌ వివరణ ఇచ్చింది. పూర్తి వివరాలు..​​​​​​​
​​​​​​​

అప్పుడు నేను మాత్రమే ముస్లిం అమ్మాయిని

‘లెడ్‌ బై’ భారతీయ ఇస్లాం మహిళల సాధికారత కోసం ఏర్పాటైన వేదిక. సంప్రదాయాల ముసుగు మాటున అణగారిపోతున్న మహిళల మేధకు పదును పెట్టి సాధికారత దిశగా అడుగులు వేయిస్తోంది డాక్టర్‌ రుహా షాబాద్‌. ముప్పై ఏళ్ల రుహా షాబాద్‌ పుట్టింది మనదేశంలోనే. పెరిగింది మాత్రం సౌదీ అరేబియాలో. మహిళలకు శిక్షణనివ్వడానికి, అభివృద్ధి వైపు నడిపించడానికి గత ఏడాది ‘లెడ్‌ బై’ సంస్థను స్థాపించిందామె.  పూర్తి వివరాలు..​​​​​​​

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top