సంజయ్‌ను విడుదల చేయండి: హై కోర్టు

Telangana High Court Orders Release Bandi Sanjay Kumar Arrest Violating COVID-19 - Sakshi

రిమాండ్‌కు సరైన కారణాల్లేవు:హైకోర్టు

విచారణ వచ్చే నెల 7కు వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయుల కేటాయింపులకు సంబంధించిన జీవో 317ను రద్దు చేయాలని ఆందోళన చేస్తూ అరెస్టయి రిమాండ్‌లో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. సహేతుక కారణాలు లేకుండానే ఆయన్ను అరెస్టు చేశారని న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ అభిప్రాయపడ్డారు. సొంత పూచీకత్తుపై ఆయన్ను విడుదల చేయాలని ఆదేశిం చారు. భవిష్యత్తులో చేసే ఆందోళనల్లో కరోనా నియంత్రణ నిబంధనలు పాటించాలని సంజయ్‌కు షరతు విధించారు. ఈ మేరకు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.

రిమాండ్‌ చేయాలనే ఉద్దేశంతోనే.. 
తన అరెస్టును చట్టవిరుద్ధంగా ప్రకటించాలంటూ సంజయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి బుధవారం విచారించారు. సంజయ్‌ను చట్టవిరుద్ధంగా పోలీసులు అరెస్టు చేశారని ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. రిమాండ్‌ చేయాలనే ఉద్దేశంతో ఎఫ్‌ఐఆర్‌లో లేకపోయినా ఐపీసీ సెక్షన్‌ 333 (ప్రభుత్వ అధికారిని తీవ్రంగా గాయపర్చడం)ను జత చేస్తూ కరీంనగర్‌ కోర్టులో మెమో దాఖలు చేశారని, కానీ అందుకు సంబంధించిన మెడికల్‌ రికార్డులు ఇంకా అందాల్సి ఉందని పేర్కొన్నారన్నారు.

మెడికల్‌ రికార్డులు పరిశీలించకుండానే సంజయ్‌ను 15 రోజుల పాటు రిమాండ్‌కు మేజిస్ట్రేట్‌ తరలిం చారని చెప్పారు. రాత్రి 10.50 గంటలకు సంజయ్‌ను అరెస్టు చేసినట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నా రని, ఎఫ్‌ఐఆర్‌ మాత్రం రాత్రి 11.15కు నమోదు చేసినట్లుందన్నారు. అరెస్టు చేసిన తర్వాత ఎఫ్‌ఐ ఆర్‌ నమోదు చేసినట్లు ఉందని, అరెస్టు చేయాలన్న ముందస్తు వ్యూహంలో భాగంగా పోలీసులు వ్యవహరించారని వివరించారు. 

ఎంత చెప్పినా సంజయ్‌ వినలేదు..
జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ అయిన సంజయ్‌ను కరోనా నిబంధనలు ఉల్లంఘించారని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తారా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. కరోనా నియంత్రణ కోసం ఆందోళనలు, ర్యాలీలు చేయరాదంటూ రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీచేసిందని, ఇందుకు విరు ద్ధంగా సంజయ్‌ పెద్ద ఎత్తున తన అనుచరులతో సమావేశమయ్యారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రతాప్‌ రెడ్డి చెప్పారు. ఆందోళన విరమించి అక్కడి నుంచి వెళ్లిపోవాలని పలుమార్లు పోలీసులు విజ్ఞప్తి చేసినా ఆయన స్పందించలేదన్నారు. అదుపులోకి తీసు కొని తర్వాత విడుదల చేద్దామని భావించామని, అయితే సంజయ్‌ తన అనుచరులతో పోలీసులపై దాడి చేశారని, తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్టు చేయాల్సి వచ్చిందని వివరించారు. ఈ వ్యవహా రంపై కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 7కు న్యాయమూర్తి వాయిదా వేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top