‘వేలం’వెర్రిని ఆపండి

Telangana: BJP Conspiring To Privatise Singareni: KTR - Sakshi

సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర

సంస్థను దెబ్బతీస్తే కేంద్రంలోని బీజేపీకే దెబ్బ 

ఇది యువతకు ఉపాధి కల్పించే గోల్డ్‌ మైన్‌ 

సింగరేణిని ప్రైవేటీకరిస్తే వారసత్వ ఉద్యోగాలు ఖతం

కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషికి మంత్రి కేటీఆర్‌ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేసే కుట్ర పన్నుతోందని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. నిన్నమొన్నటి వరకు నల్లచట్టాలతో రైతులను నట్టేట ముంచే కుతం త్రాలు నడిపిన కేంద్రం ఇప్పుడు నల్లబంగారంపై కన్నేసిందని విరుచుకుపడ్డారు. సింగరేణిపై ప్రైవేటు వేటు వేస్తే తెలంగాణ సమాజం బీజేపీపై రాజకీ యంగా వేటు వేసేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

సిరులు కురిపిస్తున్న సింగరేణి జోలికొస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకడం ఖాయమని హెచ్చరిం చారు. సింగరేణి పరిధిలోని నాలుగు బొగ్గు గనులను ఆ సంస్థకు కేటాయించకుండా వాటిని వేలానికి పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సింగరేణికి బొగ్గు గనులను నేరుగా సంస్థకే కేటాయించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి కేటీఆర్‌ లేఖ రాశారు. సింగరేణిని కాపాడుకునేం దుకు కార్మికులకు అండగా ఉంటామని, వారితో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపడతామని చెప్పారు.

కేంద్రం మెడలు వంచిన రైతు పోరాటాన్ని మరి పించే మరో ఉద్యమానికి సింగరేణి కార్మికులు సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు. ఈ వేలంవెర్రి ఆలోచనలు ఇప్పటికైనా మానుకోకపోతే సింగరేణి కార్మికులు మరోసారి ఉక్కు పిడికిళ్లు బిగించడం ఖాయమని, కేంద్రంలోని బీజేపీని తరమడం తథ్యమని హెచ్చరించారు.

అంబేడ్కర్‌ ఆశయాలకు తూట్లు: ‘సింగరేణి అంటే కోల్‌ మైన్‌ మాత్రమే కాదు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే గోల్డ్‌ మైన్‌. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 16వేల ఉపాధి అవకాశాలను కల్పించింది. ఉద్యోగ ఉపాధి కల్పనకు కేరాఫ్‌గా ఉన్న ఈ రంగాన్ని ప్రైవేటుపరం చేయడం అంటే, అంబేడ్కర్‌ ఆశయాలకు తూట్లు పొడవడమే. రిజర్వేషన్లకు పాతరేసే ఈ కుతం త్రాన్ని సాగనివ్వబోం’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తే వారసత్వ ఉద్యోగాలు దొరికే అవకాశమే ఉండదని, ప్రైవేట్‌ సంస్థల చేతుల్లోకి వెళ్లిన తర్వాత గనులను మూసేస్తూ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉందన్నారు.  

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ లాగే సింగరేణిపై కుట్ర..
‘పక్క రాష్ట్రం ఏపీలోనూ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు కావాల్సిన ఐరన్‌ ఓర్‌ గనులు ఇవ్వకుండా నష్టా లకు గురిచేసిన కేంద్రం.. దాన్ని ప్రైవేటీకరించేం దుకు రంగం సిద్ధం చేసింది. కేంద్రం దగ్గర ఇప్పటికీ స్టీల్‌ ప్లాంట్‌కు చెందిన 27 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి కుట్రలనే సింగరేణిపై ప్రయోగించేందుకు కుట్రపన్నింది. తెలంగాణ ఏర్పాటైన ఏడేళ్లలో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి 450 లక్షల టన్నుల నుంచి 670 లక్షల టన్నులకు పెరిగింది. దీంతోపాటు బొగ్గు తవ్వ కాలు, రవాణా, లాభాలు, కంపెనీ విస్తరణ విష యం లోనూ సింగరేణి గణనీయమైన ప్రగతిని సాధించింది. సింగరేణి రాష్ట్రానికే పరిమితం కాకుండా మహారాష్ట్రతోపాటు దేశంలోని ఇతర థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు భారీ ఎత్తున బొగ్గు సరఫరా అందిస్తోంది.

దేశంలో ఏ ప్రభుత్వరంగ సంస్థ ఇవ్వని విధంగా 29 శాతం లాభాల్లో వాటాను ఇస్తున్న ఏకైక సంస్ధ సింగరేణి. ఇలాంటి సంస్థను బీజేపీ ప్రభుత్వం నష్టాలు చూపి మొత్తంగా ప్రైవేటీకరించే కుట్ర సాగిస్తోంది. గుజ రాత్‌లో లిగ్నైట్‌ గనులను వేలం లేకుండా నేరుగా గుజరాత్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ సంస్ధకు కేటా యించినట్టు, తెలంగాణలోని సింగరేణికి ఎం దుకు ఇవ్వడం లేదు? బీజేపీ పాలనలోని గుజ రాత్‌కో విధానం, తెలంగాణకో విధానమా?’అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top