‘బీజేపీని గద్దె దింపుతాం’

Telangana: Amarjeet Kaur Comments On Narendra Modi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ కాచిగూడ: ప్రధాని మోదీ అమలు చేస్తున్న విధానాలు దేశాన్ని అమ్మివేసే విధంగా ఉన్నాయని ఏఐటీ యూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్‌ కౌర్‌ ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మిషన్‌ 2024 లక్ష్యంగా ఏఐటీయూసీ పోరు సాగిస్తుందని వెల్లడించారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో శ్రామిక వర్గం, ఇతర వర్గాల ప్రజలు బీజేపీని ఓడించ టమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపుని చ్చారు. దేశాన్ని కాపాడండి అన్న నినా దంతో మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా సార్వ త్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఏఐటీ యూసీ జాతీయ జనరల్‌ కౌన్సిల్‌ సమా వేశాలు 3 రోజులపాటు హైదరాబాద్‌లో జరి గాయి. చివరి రోజైన సోమవారం జనరల్‌ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయాలను, తీర్మానాలను ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శులు బి.వి. విజయలక్ష్మి, మోహన్‌ శర్మ, సుకుమార్‌ దామ్లే, బబ్లీ రావత్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌. బాల్‌రాజ్‌లతో కలసి అమర్‌జీత్‌ కౌర్‌ మీడి యాకు వెల్లడించారు. ప్రభుత్వరంగ సం స్థల అమ్మకం, జాతి సంపదను కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేసే చర్యలను ప్రతిఘటిస్తా మన్నారు. రైతుల ఉద్యమ స్ఫూర్తితో సమ్మె చేసి మోదీకి గుణపాఠం చెబుతామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top