1.35 లక్షలు దాటిన కేసులు

One Lakh Thirty Five Thousand Coronavirus Cases Crossed In Telangana - Sakshi

రాష్ట్రంలో తాజాగా 2,478 మందికి కరోనా 

మరో 10 మంది మృతి..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు తెలంగాణవ్యాప్తంగా 16,05,521 నిర్ధారణ పరీక్షలు చేయగా, మొత్తం కేసుల సంఖ్య 1,35,884కి చేరింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు శుక్రవారం బులెటిన్‌ విడుదల చేశారు. రాష్ట్రంలో గురువారం 62,543 కరోనా టెస్టులు చేయగా, 2,478 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. తాజాగా కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో కోవిడ్‌ మరణాల సంఖ్య 866కి చేరింది.

ప్రస్తుతం కోవిడ్‌తో 32,994 మంది చికిత్స పొందుతుండగా, అందులో 25,730 మంది ఇళ్లు లేదా ఇతరత్రా ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా 2,011 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,02,024కి చేరుకుంది. రాష్ట్రంలో సగటున 10 లక్షల జనాభాకు 43,245 కరోనా టెస్టులు చేశారు. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 267 వచ్చాయి. ఇక మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 190, రంగారెడ్డి జిల్లాలో 171, నల్లగొండ జిల్లాలో 135, కరీంనగర్‌ జిల్లాలో 129, ఖమ్మం జిల్లాలో 128 కరోనా కేసులు నమోదయ్యాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top