తొమ్మిదేళ్లుగా బాలిక నరకం..18 సార్లు విఫల ప్రయత్నం..19వసారి ఫలించిన వైద్యం 

Hyderabad: After 18 times Fail, Successful Treatment For Bronchial Fistula - Sakshi

అరుదైన లోపానికి పరిష్కారం

తొమ్మిదేళ్లుగా బాలిక నరకం

ఎస్‌ఎల్‌జీ వైద్యుల విజయం 

సాక్షి, లక్డీకాపూల్‌: బ్రాంకియల్‌ ఫిస్టులా సమస్యకు 19వసారి వైద్యం ఫలించింది. పుట్టుకతోనే అరుదైన లోపంతో తొమ్మిదేళ్లుగా బాధపడుతున్న 16 ఏళ్ల బాలికకు నగరంలోని ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా చికిత్స చేశారు. పదేళ్లుగా 18సార్లు చేసిన సర్జరీలు విఫలం కాగా.. 19వ సారి చేసిన చికిత్స ఫలితాన్నిచ్చింది. వైద్యుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన రోగి మెడ భాగంలో తొమ్మిదేళ్ల నుంచి వాపు, చీము వస్తుండటంతో ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించారు.

అప్పటి నుంచి ఏడాదికి కనీసం రెండుసార్లు సర్జరీలు జరిగాయి. ప్రతిసారి చీము తీసేయడంతో తాత్కాలిక ఉపశమనం లభించింది. కానీ.. కొన్ని నెలల తర్వాత పరిస్థితి మొదటికొచ్చేది. ఆహారం మింగడంలో కూడా ఇబ్బంది ఎదురయ్యేది. ఈ సమస్య గురించి తల మెడ కేన్సర్‌ కన్సల్టెంట్, రీకన్సట్రక్టివ్‌ అండ్‌ లేజర్‌ సర్జన్‌ అయిన డాక్టర్‌ భార్గవ్‌ ఇలపకుర్తి మాట్లాడుతూ.. ‘కాంట్రాస్ట్‌ సీటీ, ఇతర పరీక్షలు జరిపాక, అసలు ఇబ్బంది ఏంటో కనుక్కున్నాం. గుండె నుంచి మెదడుకి వెళ్లే ముఖ్యమైన రక్తనాళాల మధ్య ఉండే చర్మం, అన్నవాహికల మధ్య ఒక అసాధారణమైన కనెక్షన్‌ ఏర్పడింది.
చదవండి: ఫుడ్‌ ఆర్డర్లలో బిర్యానీదే హవా..సెకనుకు 2 బిర్యానీలు.. హాంఫట్‌

ఇది థైరాయిడ్‌ గ్రంథికి దగ్గరగా ఉండి సుపీరియర్‌ లారింజియల్‌ నర్వ్‌కి కూడా తగలడంతో ప్రాణహాని ఏర్పడింది. దీంతో ఇతర అవయవాలకు ఎలాంటి అపాయం జరక్కుండా పూర్తిగా ఆ ట్రాక్‌ని తొలగించాం. ఒక మల్టీ–డిసిప్లినరీ విధానంలో చాలా క్లిష్టమైన సర్జరీ చేశాం. ప్రస్తుతం రోగి కోలుకున్నారు’ అని భార్గవ్‌ తెలిపారు. 
    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top