హైదరాబాద్‌లో భారీ వర్షం.. మరో 3 రోజులు వానాలే వానలు | Heavy Rain Lashes Most Parts In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో భారీ వర్షం.. మరో 3 రోజులు వానాలే వానలు

Published Fri, Jun 21 2024 5:02 PM | Last Updated on Fri, Jun 21 2024 5:22 PM

Heavy Rain Lashes Most Parts In Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

కాగా, హైదరాబాద్‌లో శుక్రవారం ఒక్కసారి వాతావరణం మారిపోయింది. భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మాదాపూర్‌, గచ్చిబౌలి,బంజారాహిల్స్‌, చార్మినార్‌, మాదాపూర్‌, కొత్తపేట,చాదర్‌ఘాట్‌, మలక్‌పేట్‌, ఎల్‌బీ నగర్‌ తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం వర్షం కురిసింది.

రాష్ట్రంలోని కొమురం భీం, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..  గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement