కోవిడ్‌: కోలుకున్నవారు వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సిన అవసరం లేదా?

Covid 19 Doubts About Vaccine And Precautions Answered By Doctors - Sakshi

అవసరం ఉంది. వారు కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్‌  తీసుకోవాలి. కోవిడ్‌ నుంచి కోలుకున్నాక శరీరంలో యాంటీబాడీస్‌ పెరుగుతాయి.. నిజమే కానీ వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల సుదీర్ఘ కాలం రక్షణ లభిస్తుంది. మరింత యాంటీబాడీస్‌ పెరగడానికి అది దోహదపడుతుంది. దీంతో మరోసారి కోవిడ్‌ బారిన పడినప్పటికీ తట్టుకునే శక్తి పెరుగుతుంది. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ జన్యుమార్పిడి పొంది వేగంగా విస్తరిస్తోంది. దీంతో పేషెంట్లు తొందరగా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందువల్ల కోవిడ్‌ వచ్చి కోలుకున్న వారు సైతం తప్పనిసరిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలి. 
-డాక్టర్‌ నివేదిత, ఫిజీషియన్, కృష్ణ ఆసుపత్రి, కరీంనగర్‌  

బాగా మరగకాచిన నీళ్ళు తాగితే గొంతులో ఉన్న వైరస్‌ చనిపోతుందనడం కరెక్టేనా?
బాగా వేడిగా ఉన్న నీటిని తాగడం అసాధ్యం. అదలా ఉంచితే వేడి నీటితో కరోనా వైరస్‌ పోతుందనేది అవాస్తవం. కొంత మంది పసుపు కలిపిన నీళ్ళు, పాలు కూడా తాగుతున్నారు. ఇటువంటి వాటివల్ల ఏం ప్రయోజనం ఉండదు. యూకలిప్టస్‌ ఆయిల్‌ గొంతులో వేసుకుని గట్టిగా దగ్గి బయటకు ఉమ్మడం ద్వారా ఆ ఘాటుకు గొంతులో ఉన్న వైరస్‌ బయటకు వచ్చేస్తుందనే మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఇది కూడా అవాస్తవం.  పూర్తిగా నిష్ప్రయోజన చర్య.
-డా. జి.చంద్రశేఖర్‌, ప్రొఫెసర్, జనరల్‌ మెడిసిన్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top