వాగులో చిక్కి భయంతో అరుపులు, కేకలు...

14 People Stucked In Floods In Mula Vagu - Sakshi

వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ సమీపంలోని మూలవాగులో చిక్కుకున్న 14 మంది మత్స్యకారులను పోలీసులు రక్షించారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో వాగు ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోవడంతో వారంతా మధ్యలో చిక్కుకున్నారు. భయంతో అరుపులు, కేకలు వేయడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ చంద్రకాంత్, టౌన్‌ సీఐ వెంకటేశ్‌ తమ బృందంతో అక్కడికి చేరుకొని.. గజ ఈతగాళ్ల సాయంతో తాళ్ల ద్వారా వారిని ఒడ్డుకు చేర్చారు. మత్స్యకారులను కాపాడిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.  

తాళ్ల సహాయంతో ఒడ్డుకు లాగుతున్న పోలీసులు, స్థానికులు

చేపల వేటకు వెళ్లి.. వరదలో చిక్కి..
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం గురువాపూర్‌కు చెందిన ఆడె శ్రీనివాస్, వెడ్మ ప్రసాద్, తొడసం శ్రవణ్‌ గురువారం చేపల వేట కోసమని సల్ఫాలవాగు ప్రాజెక్టు మత్తడి వద్దకు వెళ్లారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఒక్కసారిగా వరద పెరగడంతో మధ్యలో ఓ మట్టిగడ్డపై చిక్కుకుపోయారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో రక్షణ చర్యలకు ఇబ్బంది ఎదురైంది. సింగరేణి రెస్క్యూ టీం, గజ ఈతగాళ్లను రప్పించి.. రాత్రి 9.45 గంటలకు వారిని
క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top