
వందకు పైగా కస్టమర్లతో వాట్సాప్ గ్రూప్
కోడ్ భాషలతో కస్టమర్లకు మేసేజ్‌లు
ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా మాదక ద్రవ్యాల సరఫరా
వాట్సాప్ గ్రూప్ గుట్టురట్టు చేసే పనిలో ఈగల్ టీం
సాక్షి, హైదరాబాద్: బీదర్‌లో గొర్రెలు కాపుకాసే వ్యక్తి..హైదరాబాద్‌కు వలస వచ్చి ఏకంగా డ్రగ్స్ డాన్‌గా ఎదిగాడు. తండ్రిని చూసి మాదక ద్రవ్యాలకు బానిసగా మారిన కర్ణాటకకు చెందిన సందీప్ అలియాస్ సందేశ్.. క్రమంగా డ్రగ్స్ పెడ్లర్‌గా ఎదిగాడు. ఇటీవల సైబరాబాద్ నార్కోటిక్ బృందం (ఈగల్) నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ సరఫరాదారుడు సందీప్ పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. సొంతూరులో మూడో తరగతి వరకు చదివిన సందీప్..2006లో ఉపాధి కోసం నగరానికి వలస వచ్చి బాలానగర్‌లోని ఓ హోటల్‌లో పనిలో చేరాడు. సందీప్ తండ్రి బలిరామ్ గంజాయి సేవించేవాడు. ఇదే అలవాటు ఇతడికీ వచ్చిందని పోలీసుల విచారణలో తేలింది. ఇతని వాట్సాప్ గ్రూప్‌లో వందలాది కస్టమర్ల డేటా ఉండటంతో వీరందరి గుట్టురట్టు చేసే పనిలో పడ్డారు.
కస్టమర్లతో వాట్సాప్ గ్రూప్..
జల్సాలు, వ్యసనాలకు బానిసైన సందీప్ అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. మహారాష్ట్రలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో యాకుత్‌పురాకు చెందిన డ్రగ్‌పెడ్లర్ అహ్మద్‌తో ఏర్పడిన పరిచయంతో నగరంలో గంజాయి కొనుగోలుదారుల సమాచారం, ఫోన్ నంబర్లు సేకరించాడు. వీరందరితో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. ప్రధానంగా ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ సరఫరా చేసేవాడు. మహారాష్ట్ర నుంచి 5 కిలోల మేర ప్యాకెట్లుగా అక్రమ మార్గంలో హైదరాబాద్ తీసుచ్చి..ఒక్కో ప్యాకెట్ (50 గ్రాములు) రూ.3 వేలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకునేవాడు.
కోడ్ భాషలో..
డ్రగ్స్ సిటీకి చేరగానే వాట్సాప్ గ్రూప్‌లో ‘భాయ్..బచ్చా ఆగయా భాయ్’ అని సందేశం పోస్టు చేసేవాడు. ఇది చూసి ఫోన్ చేసిన వారికి లోకేషన్ వివరాలు చెప్పేవాడు. ఈ క్రమంలోనే ఈనెల 13న మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకొచ్చి గచ్చిబౌలిలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వద్ద ఉన్నట్లు సమాచారం ఇచ్చాడు. ఈమేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న ఈగల్ బృందం..సందీప్‌ను పట్టుకుంది. అయితే అప్పటికే కస్టమర్లు ఎవరూ లొకేషన్‌కు రాకపోవడంతో పోలీసులే సందీప్ ఫోన్ నుంచి వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేయగా అక్కడికి వచి్చన 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి డ్రగ్స్ కిట్స్‌తో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచి్చంది. దీంతో అందర్నీ డీ–అడిక్షన్ కేంద్రానికి తరలించారు. వీరి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని విశ్లేషించగా..మరో 99 మంది కస్టమర్ల వివరాలు పోలీసులకు చిక్కాయి. దీంతో వీరి పేర్లనూ ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.