తమిళసినిమా: నటుడు మాధవన్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం జీడీ నాయుడు. వర్గీస్ ములన్ పిక్చర్ , ట్రికలర్ ఫిలింస్ సంస్ధలు కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. వాస్తవ ఘటనలతో ఇప్పటి వరకూ చెప్పన కథాంశాలతో రూపొందించే కథా చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. అలాంటి యదార్ధ కథంతో రూపొందిస్తున్న చిత్రం జీడీ.నాయుడు. కృష్ణకుమార్ రామకుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం ఇండియన్ ఎడిసన్‌గా పేరుగాంచిన వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూర్ అనబడే జీడీ.నాయుడు జీవిత ఇతివృత్తంతో తెరకెక్కుతోంది. జీడీ.నాయుడు జీవితంలో ఒక ముఖ్య అధ్యాయంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆయన విప్లవాత్మక ఆలోచనలు, మార్గదర్శకాలుగా నిలిచే ఘటనల కారణంగా ఆయన్ని ఇండియాలోనే ఒక తెగసీగా కీర్తీంచేలా చేశాయని దర్శకుడు తెలిపారు. జాతీయ అవార్డును గెలుచుకున్న రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్ చిత్రం తరువాత వర్గాస్ ములన్ పిక్చర్స్,ట్రికలర్ ఫిలింస్ సంస్ధల అధినేతలు నటుడు మాదవన్, సరితా సరితామాధవన్, వర్గీస్ ములన్, విజయ్ ములన్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. మాధవన్ టైటిల్ పాత్రను పోషిస్తున్న ఇందులో నటుడు సత్యరాజ్, ప్రియమణి, జయరాం,దుషారా విజయన్ తంబిరామయ్య, వినయ్‌రాయ్,కరుణాకరన్ ముఖ్య పాత్రలు పోషించారు. కాగా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా జీడీ. నాయుడు చిత్రాన్ని తమిళనాడులో ఎజీఎస్ సంస్థ విడుదల చేయనుంది.


