తిరుత్తణి: తిరువలంగాడులోని అంబేడ్కర్ నగర్‌లో ఏటా మందవెళి అమ్మన్ జాతర వేడుకలు కోలాహలంగా నిర్వహిస్తారు. నాలుగు రోజుల పాటూ నిర్వహించే జాతర వేడుకలు సందర్భంగా శుక్రవారం భక్తులు కంకణాలు ధరించారు. శనివారం 301 మంది మహిళలు పాల్గొన్న పాల బిందెల ఊరేగింపు చేపట్టారు. పాలతో అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం పుష్పాలతో అమ్మవారిని అలంకరించి మహాదీపారాధన పూజలు చేపట్టి దర్శించుకున్నారు. సాయంత్రం మహిళలు దీప పూజలు చేపట్టారు. వేడుకలు సందర్భంగా అమ్మవారి ఆలయంతో గ్రామ వీధులు విద్యుదీపాలతో అందంగా ముస్తాబు చేసారు.


