నరువిలో నర్సుల దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

నరువిలో నర్సుల దినోత్సవం

May 24 2026 1:33 AM | Updated on May 24 2026 1:33 AM

వేలూరు: ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వేలూరు నరువి ఆస్పత్రిలో చైర్మన్‌న్‌ జీవి సంపత్‌ అధ్యక్షతన కొవ్వొత్తులు వెలిగించి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా ఆస్పత్రిలో రోగులకు విశిష్ట సేవలు అందించిన నర్సులను అభినందించి సర్టిఫికెట్లను అందజేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులను ప్రేమతో పలకరించి వైద్య సేవలు అందజేస్తామని రోగులు మనస్సు బాధపడకుండా చూసుకుంటామని నర్శింగ్‌ సిబ్బందిచే ప్తిజ్ఞ చేయించారు. చైర్మన్‌ మాట్లాడుతూ దేశంలో అన్ని సేవలకన్నా నర్సుల సేవ మరవరాదన్నారు. ప్రమాదంలో ఉన్న వారిని డాక్టర్‌ల కన్నా ముందుగా నర్సులే చూస్తారని వారితో ప్రేమగా మాట్లాడి వారికి అవసరమైన వైద్య సేవలు అందజేయాలని తెలిపారు. రోగులను దైవంగా భావించాలన్నారు. ఆస్పత్రి ఉపాధ్యక్షులు అనిత, కార్యనిర్వహణ డైరెక్టర్‌ డాక్టర్‌ పాల్‌హెండ్రీ, డాక్టర్‌ అరవింద్‌నాయర్‌, జీఎం నితిన్‌ సంపత్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌ జాకప్‌ జోస్‌, నర్సింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement