వేలూరు: ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రతి టీచర్ కష్టపడి పనిచేయాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పది పరీక్ష ఫలితాల్లో వందశాతం మార్కులు సాధించిన విద్యార్థులకు, పాఠశాల ప్రధానోపాద్యాయులకు అభినందన, అవార్డు ల ప్రదానోత్సవ కార్యక్రమం వేలూరు కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఆమె మాట్లాడుతూ పది ఫలితాల్లో వేలూరు జిల్లా వెనుకంజలో ఉందని, మొదటి స్థానానికి తీసుకొచ్చేందుకు కృషిచేయాలన్నారు. ఉత్తీర్ణత శాతాన్ని పెంచడమే లక్ష్యంగా విద్యా బోధన చేయాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లా స్థాయి మార్కులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, హెచ్‌ఎంలను అభినందించి సర్టిఫికెట్లను అందజేశారు. విద్యాశాఖ సీఈఓ ప్రేమలత, విద్యాశాఖ అధికారులు సెంథిల్‌కుమార్, కేశవన్, హెచ్‌ఎంలు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


