తమిళసినిమా: పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన శీను రామస్వామి మంచి రచయిత కూడా. ఈయన పలు కథలను, నవలలను రాశారు. తాజాగా సినిమావిన్ ఆన్మ పేరుతో ఒక పుస్తకం రాశారు. దర్శకుడు శీను రామస్వామి ముఖ్యమంత్రి విజయ్‌కు ఒక విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. అందులో నేను తాజాగా రాసిన సినిమావిన్ ఆన్మ ( సినిమా అప్రిషియేషన్, ఎడ్యుకేషన్, అండ్ ఏ ఫ్యూ మోర్ ఎస్సెస్ ) పుస్తకాన్ని సంధ్య పబ్లికేషన్ సంస్థ ప్రచురణ చేసింది. ఇది నా సినిమా రచనా విద్య. పాఠశాలల్లో స్పోర్ట్స్, చిత్రలేఖనం వంటి ఫైనాన్‌న్స్ గురించి బోధిస్తున్నా రు. అయితే అందరూ క్రీడాకారులు గానో, చిత్ర లేఖ కళాకారులుగానో మారడం లేదు. మనలో నరనరాల్లో ఇమిడిపోయిన సినిమా గురించి సరైన అవగాహన కలిగించే తరగతులు లేవు. ముఖ్యంగా ఈతరం పిల్లలు ఎక్కువగా సెల్‌ఫోన్లతోనే ఉంటున్నారు. అలాంటి వారికి మంచి సినిమా ఏది అని తెలియజేయడం మన బాధ్యత. పిల్లలకు చిన్నతనంలోనే మంచి కథాంశం కలిగిన చిత్రాలను చూపించి వాళ్లలో సినిమా రచనా విద్య ముఖ్యమనే భావనను పెంపొందించాలనే బాధ్యత తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మనకు ఉంది. అలా పిల్లలకు చూపించాలనే సినిమావిన్ ఆన్మ పుస్తకాన్ని నేను రాశాను. సినిమా రచన విద్యను ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి విద్యార్థుల వరకు ఎలా నేర్పించాలి అని చెప్పే పుస్తకం. ఇది ఉపాధ్యాయులు, సినిమా విద్యార్థులు.యువత కోసం పుస్తకం. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన పుస్తకం అని పేర్కొన్నారు.
తమిళసినిమా: వైజీ మహేంద్రన్, సత్యరాజ్, సముద్రఖని, తలైవాసల్ విజయ్, సుహాసిని మణిరత్నం, రమ్యా పాండియన్, రాజ్ అయ్యప్ప, మధువంతి అరుణ్ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం చారుకేశి. దీన్ని వైజీ.మహేంద్రన్ నటించి ప్రాచుర్యం పొందిన నాటకాన్ని చిత్రంగా వెండి తెరపై ఆవిష్కరించారు అన్నది గమనార్హం. దర్శకుడు సురేష్‌కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవా సంగీతాన్ని అందించారు. అరుణ్ విజువల్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని ఈ5 ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ అధినేత జే.జయకృష్ణన్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. చిత్ర ఆడియో, ట్రైలర్‌ను రజనీకాంత్ గురువారం విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక వర్గంతో పనిచేయడం సంతోషకరమని చిత్ర దర్శకుడు సురేష్‌కృష్ణ పేర్కొన్నారు. బలమైన కథ, చక్కని అనుబంధాలు, మనసులో నిలిచి పోయే సంగీతం, అత్యుత్తమ కళాకారుల నటనా ప్రతిభ కలిగిన ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన థియేటర్ అనుభూతిని కలిగిస్తుందని సురేష్‌కృష్ణ తెలిపారు.
ఆయన అని తెలియగానే సంతోసించా!
సినిమాను విద్యగా
మార్చండి


