కామెంటేటర్ల కోసం అన్వేషణ
సాక్షి, చైన్నె: క్రికెట్‌పై ఉన్న మక్కువను, అద్భుతమైన గళం, యువత ఆశయాలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ క్యారెట్‌లేన్ సంస్థ భాగస్వామ్యంతో టైమ్‌లింక్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘వాయిస్ హంట్ – కామెంటరీ బాక్స్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తర్వాత తరం అత్యుత్తమ క్రికెట్ కామెంటేటర్లను గుర్తించడానికి రూపొందించబడిన ఒక అద్భుతమైన వేదికగా దీనిని ప్రకటించారు. క్రికెట్‌పై దేశంలో ఉన్న విపరీతమైన క్రేజ్‌ను నేపథ్యంగా చేసుకుని, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మెగా ఈవెంట్‌కు శుక్రవారం అన్నానగర్‌లోని తనిష్క్ ప్రాంగణంలో జరిగింది. ఉచిత ప్రత్యేక కామెంటరీ వర్క్‌షాప్ (శిక్షణ శిబిరం) పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు భారీ నగదు బహుమతులు, యువ ప్రతిభను ప్రోత్సహించడంలో, కేవలం పోటీగా మాత్రమే కాకుండా వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే అనుభవ వేదికలను సృష్టించడం టైమ్‌లింక్స్ లక్ష్యంగా నిర్వాహకులు ప్రకటించారు. వాయిస్ హంట్ అనేది కేవలం ఒక పోటీ మాత్రమే కాదు, ఇది స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ (క్రీడా ప్రసారాల) అద్భుతమైన ప్రపంచంలోకి ప్రవేశించడానికి ఒక ప్రధాన ద్వారం. క్రీడలపై ఉన్న మక్కువ మైక్రోఫోన్‌న్‌ను కలిసే వేదిక ఇది, ఇక్కడి నుంచే అద్భుతమైన గొంతులు భవిష్యత్తులో చెరగని గుర్తింపుగా మారుతాయి‘ అని ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బైక్
– తండ్రీకుమారుడు దుర్మరణం
తిరువొత్తియూరు: విద్యుత్ స్తంభాన్ని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ తండ్రీకుమారుడు మృతిచెందారు. భార్య మరో కుమారుడు సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వండలూర్–మీంజూర్ అవుటర్ రింగ్ రోడ్డుపై జరిగింది. చైన్నె శివారు నగర్‌మీంజూర్ ప్రాంతానికి చెందిన సతీష్ (34). ఇతని భార్య రంజని(28), కుమారుడు శైలేష్ (6) ,9 నెలల శిశువు హరిహరన్, బంధువు కీర్తన (16) సహా కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే బైక్‌పై చైన్నె, రెడ్‌హిల్స్ సమీపం అలమాతిలో జరిగిన ఒక శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. వండలూర్, మీంజూర్ బైపాస్ రోడ్డులో వస్తున్న సమయంలో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈప్రమాదంలో సతీష్, కుమారుడు శై లేస్ మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని పోలీసులు చైన్నె స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
టాస్మాక్ ఉద్యోగుల ఆందోళన
తిరువళ్లూరు: టాస్మాక్ ఉద్యోగులపై పోలీసులు నమోదు చేస్తున్న అక్రమ కేసులు, ప్రయివేటు వ్యక్తుల బెదిరింపుల నుంచి ఉద్యోగులకు భద్ర త కల్పించాలని కోరుతూ తమిళనాడు టాస్మాక్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి ఐక్యవేదిక ఆద్వర్యంలో శుక్రవారం ఉదయం ఽపెద్దకుప్పంలో ఆందోళన నిర్వహించారు. ఆందోళనకు ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనశేఖర్ అద్యక్షత వహించగా, రాష్ట్ర కోశాధికారి గోవిందరాజ్, ఎస్టీ ఎస్సీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నాదురై హాజరై ప్రసంగించారు. ధనశేఖరన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా టాస్మాక్ ఉద్యోగులపై పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఒక వ్యక్తికి రెండు కంటే ఎక్కువ బాటిళ్లు విక్రయించినట్టు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారని, రాత్రి సమయంలో పోలీసుల నుంచి మరింత వేధింపులు ఎక్కువయ్యాయని వాపోయారు. తాము షట్టర్ మూసి లోపల లెక్కులు చూస్తున్నా వేధిస్తున్నారని ఆరోపించారు. టీవీకే నేతలు కొందరు సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తూ తాము ఎంఆర్‌పీ రేట్లు కంటే ఎక్కువగా విక్రయిస్తున్నట్టు తప్పుడు పోస్టులను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నట్టు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సరికొత్త క్రియేటివ్
క్యాంపెయిన్ ఆవిష్కరణ
సాక్షి, చైన్నె : ప్రముఖ డిజిటల్ ఇమేజింగ్ సంస్థలలో ఒకటైన కానన్ ఇండియా ప్రింటింగ్‌ను కేవలం డాక్యుమెంట్ల ముద్రణకే పరిమితం చేయకుండా, అద్భుతమైన సృజనాత్మకతకు, ఆత్మప్రకటనకు, సరికొత్త ఆలోచనలకు ఒక శక్తివంతమైన ఆయుధంగామలిచే విధంగా సరికొత్త ఇంటిగ్రేటెడ్ క్యాంపెయిన్‌న్‌ను ప్రారంభించింది. డిజిటల్ ప్రపంచంలో ప్రతిదీ స్క్రీన్లకే పరిమితమవుతున్న ఈ రోజుల్లో ఈ క్యాంపెయిన్ ప్రత్యేకతను సంతరించుకున్నట్టు ఆ సంస్థ ఉపాధ్యక్షుడు సుకుమారన్, హవాస్ క్రియేటి వ్ ఇండియా డైరెక్టర్ అనుపమ రామస్వామి ప్రకటించారు. ఇళ్లలో తల్లిదండ్రులు, పిల్లలు కేవలం ఈ–మెయిళ్లు, స్క్రీన్లకు పరిమితం కాకుండా చేతులతో తాకగలిగే, క్రియేటివ్ వర్క్స్ వైపు మోగ్గుచూపే విధంగా ముందుకెళ్తున్నామన్నారు.హావాస్ క్రియేటివ్ ఇండియా పేరిట ఈ క్యాంపెయిన్ సాగనున్నదన్నారు.


