అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి

May 23 2026 12:46 AM | Updated on May 23 2026 12:46 AM

వేలూరు: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కలెక్టర్‌ సుబ్బలక్ష్మి అఽధికారులను ఆదేశించారు. వేలూరు కలెక్టరేట్‌లో జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష, వేలూరు జిల్లాలో నూతనంగా ఎంపికై న ఎమ్మెల్యేల పరిచయ కార్యక్రమం కలెక్టర్‌ అద్యక్షతన జరిగింది. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం నూతనంగా ఎంపికై న ఎమ్మెల్యేలు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సంక్షేమ పథకాలు జిల్లాలోని అర్హులందరికీ అందేలా అన్ని శాఖల అధికారులతో పాటు ఎమ్మెల్యేలు కూడా సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఒ శివసుబ్రమణ్యం, సబ్‌ కలెక్టర్‌ సెంథిల్‌కుమార్‌, అదనపు ఎస్పీ పయణి, ఎమ్మెల్యేలు సుధాకర్‌, వినోద్‌కన్నన్‌, తెండ్రల్‌కుమార్‌, వేలయగన్‌, సింధు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement