వేలూరు: స్థానిక సత్‌వచ్చారిలోని రోడ్డు గంగమ్మ రథోత్సవం శుక్రవారం కోలాహలంగా జరిగింది. ముందుగా రోడ్డు గంగమ్మకు ప్రత్యేక శిరస్సు పూజలు నిర్వహించి పుష్పాలంకరణలు చేసిన రథంలో ఆశీనులు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ ఊరేగింపుగా అమ్మవారిని సత్‌వచ్చారిలోని వీధుల్లోకి తీసుకొచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి రథాన్ని లాగారు. అదే విధంగా రథంపై భక్తులు బొరుగులు, మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రథాన్ని ఆలయం వద్దకు తీసుకొచ్చి ఆలయంలోని విగ్రహంపై శిరస్సును ఉంచి ప్రత్యేక పుష్పలంకరణలు నిర్వహించారు. భక్తులు పొంగళ్లు పెట్టి వివిధ వేషాలు దరించి అమ్మవారికి అంబలి, పట్టు వస్త్రాలను సమర్పించారు.


