సాక్షి,చైన్నె : విద్య, పారిశ్రామిక రంగానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించి, విద్యార్థులకు ఆచరణాత్మకమైన కార్పొరేట్ చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఎస్‌ఆర్‌ఎమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌న్స్ అండ్ టెక్నాలజీకి చెందిన ఎస్‌ఆర్‌ఎమ్ స్కూల్ ఆఫ్ లా, ప్రముఖ సెమీకండక్టర్ డిజైన్ సంస్థ టెస్సోల్వ్ సెమీకండక్టర్ ప్రైవేట్ లిమిటెడ్‌ల మధ్య ఒక చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదిరింది. ఎస్‌ఆర్‌ఎమ్‌ఐఎస్‌టీ ప్రో విసి–లా డాక్టర్ వైఎస్‌ఆర్ మూర్తి, టెస్సోల్వ్ కో–ఫౌండర్ , ప్రెసిడెంట్ డాక్టర్ వీరప్పన్ ఈ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశారు.


