పుస్తకావిష్కరణ! | - | Sakshi
Sakshi News home page

పుస్తకావిష్కరణ!

May 23 2026 12:16 AM | Updated on May 23 2026 12:16 AM

సాక్షి,చైన్నె : కంచి కామకోటి పీఠం 68వ జగద్గురు చంద్రశేఖరేంద్రసరస్వతి మహాస్వామి (కంచీ మహాపెరియవ) జీవితంలోని అత్యంత ఆధ్యాత్మిక, చారిత్రాత్మక ఘట్టాలను ఆవిష్కరిస్తూ రూపొందించిన సరికొత్త పుస్తకం యన్‌ నెంజు నిరయ పుగుందార్‌: శ్రీ కాంచీ మహా పెరియవాళుమ్‌ ఏకాంబరమాగియ నానుమ్‌ (పార్ట్‌–2) పేరిట చైన్నెలో శుక్రవారం ఈ పుస్తకం ఆవిష్కరించారు. శివ విష్ణు చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో చైన్నె టి. నగర్‌లోని వాణీ మహల్‌లో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మహాస్వామికి అత్యంత సన్నిహితుడు ఏకాంబరం ఈ గ్రంథాన్ని రచించారు. 20వ శతాబ్దపు అత్యంత విశిష్ట ఆధ్యాత్మిక యాత్రను కళ్లకు కట్టేలా ఆయన తన ప్రత్యక్ష అనుభవాలను పంచుకున్నారు. ఈ పుస్తకం ప్రధానంకంచి మహాస్వామి చేసినన సుదీర్ఘ పాదయాత్ర నేపథ్యంగా సాగుతుంది. 84 సంవత్సరాల వయస్సులో కూడా మహాస్వామి కాంచీపురం నుంచి సతారా వరకు 3,860 కిలోమీటర్ల మేర కాలినడకన చేసిన పాదయాత్ర గురించి వివరించారు. ఈ పుస్తకం ఒక సజీవ చారిత్రాత్మక రికార్డు. డాక్టర్‌ మణిద్రావిడ్‌ శాస్త్రి (మహామహోపాధ్యాయ – ప్రొఫెసర్‌), కె. జయరామకృష్ణన్‌ (పరిశ్రమల రంగ నిపుణులు),కె. చంద్రశేఖరన్‌ (న్యాయవాది, మద్రాసు హైకోరు), ఎన్‌. నారాయణన్‌ (తమిళనాడు బ్రాహ్మణ అసోసియేషన్‌), పి. సురేష్‌ (ఎండీ, అరుణ్‌ ఎక్సెల్లో గ్రూప్‌) పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement