సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తిక ర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం క్యాబినెట్ లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా చేరబోతోంది. తమ పార్టీ తరపున పాపనాశం నియోజకవర్గ ఎమ్మెల్యే ఏ.ఎమ్. షాజహాన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు ఐయూఎమ్‌ఎల్ జాతీయ అధ్యక్షుడు ఖాదర్ మొహిదీన్ గురువారం అధికారికంగా ప్రకటించారు. ఉదయం జరిగిన ప్రమాణ స్వీకారంలో ఐయూఎమ్‌ఎల్‌కు చోటు దక్కకపోవడంపై చర్చ నడుస్తున్న తరుణంలో, మధ్యాహ్నం ఆ పార్టీ రాష్ట్ర ప్ర తినిదులు అత్యవసర సమావేశం చైన్నెలో జరిగింది.
అడగకుండానే దక్కిన అవకాశం
ఈ సమావేశం అనంతరం మీడియాలో మాట్లాడిన ఖాదర్ మొహిదీన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పడినప్పుడు తమ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎలాంటి నిబంధనలు లేదా డిమాండ్లు పెట్టకుండా, బేషరతుగా మ ద్దతు ప్రకటించారని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రభు త్వం అద్భుతంగా నడుస్తోందన్నారు. తాము మంత్రి పదవుల గురించి అడగకపోయినా, ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పెద్ద మనసుతో మమ్మల్ని సంప్రదించారని పేర్కొన్నారు. ఐయూఎమ్‌ఎల్‌ను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలనుకుంటున్నామని, ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరిని మంత్రివర్గంలోకి పంపాలని కోరినట్టు తెలిపారు. ఇది తమకు ఊహించని శుభవార్త. అని ఆయన తెలిపారు. ఈ విషయమై కేరళలో ని ఐయూఎమ్‌ఎల్ అగ్రనాయకత్వంతో చర్చించినట్లు ఖాదర్ మొహిదీన్ పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వంలో ఐయూఎమ్‌ఎల్ చేరడాన్ని కేంద్ర కమిటీ కూడా ఆమోదించిందన్నారు. పార్టీకి ఉన్న ఇద్దరు ఎ మ్మెల్యేలకూ మంత్రి పదవులు ఎందుకు అడగకూడదనే ప్రతిపాదన వచ్చినట్లు ఆయన తెలిపారు. అయి తే, ప్రస్తుతానికి మొదట ఒకరిని మంత్రివర్గంలోకి పంపి, ఆ తర్వాత రెండో ఎమ్మెల్యే పదవి గురించి సీఎంతో మాట్లాడాలని నిర్ణయించామన్నారు. కాగా ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనే పూర్తి అధికారాన్ని పార్టీ తనకు అప్పగించగా, పాపనాశం ఎమ్మెల్యే ఏ. ఎమ్. షాజహాన్ పేరును ఖరారు చేశామన్నారు. ఈ నిర్ణయంతో త్వరలోనే ఏ.ఎమ్.షాజహాన్ తమిళనా డు నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నార న్నది ఖాయమైంది. తద్వారా విజయ్ కేబినెట్‌లో మరో మిత్రపక్షానికి చోటు దక్కనుంది. షాజహా న్‌కు మైనారిటీ సంక్షేమ శాఖ అప్పగించే అవకాశాలు ఉన్నాయి. కాగా విజయ్ కేబినెట్‌లో తాము చేరబోతున్నామని వీసీకే నేత తిరుమాళవళవన్ గురువారం రాత్రి ప్రకటించారు.


