తిరువొత్తియూరు: చైన్నె కార్పొరేషన్‌లో 383 అమ్మ క్యాంటీన్లు నడుస్తున్నాయి. కొంతమంది పేదలు క్యాంటీన్లపై ఆధారపడి జీవిస్తున్నారు. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో అమ్మ క్యాంటీన్లు పునరుద్ధరించబడ్డాయి. పాత సామగ్రిని మార్చి కొత్తవి కొనుగోలు చేశారు. దీంతో క్యాంటీన్లలో మళ్లీ జనం రద్దీ పెరగింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే, అమ్మ క్యాంటీన్లలో ఆహార నాణ్యతను మెరుగుపరచాలని ఆదేశించారు. దీనిని అనుసరించి చైన్నె కార్పొరేషన్ కొత్త కమిషనర్ డాక్టర్ జి.ఎస్.సమీరన్, బుధవారం రాత్రి అన్నానగర్‌లోని టైలర్ రోడ్డులో ఉన్న క్యాంటీనన్‌కు వెళ్లిన కమిషనర్ తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఉన్న ప్రజలతో ఆహారం నాణ్యత గురించి చర్చించారు. వంట సామగ్రి నిల్వ, భోజన ప్రాంతాన్ని పరిశీలించారు. అదేక్రమంలో గురువారం ఉదయం తి.వి.క నగర్ మండలం 77వ వార్డులోని టి.మెయిల్స్ రోడ్డు క్యాంటీన్ లో కమిషనర్ సమీరన్ తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. ఉద యం అందించే టిఫిన్ తిని చూసి నాణ్యతను పరీక్షించారు. ఆహారాన్ని నాణ్యతగా అందించాలని ఆయన ఆదేశించారు.


