మలేషియా ర్యాపర్‌ ఆల్బమ్‌ ‘నావేరే లెవెల్‌’ | - | Sakshi
Sakshi News home page

మలేషియా ర్యాపర్‌ ఆల్బమ్‌ ‘నావేరే లెవెల్‌’

May 22 2026 4:16 AM | Updated on May 22 2026 4:16 AM

తమిళసినిమా: ప్రైవేట్‌ మ్యూజికల్‌ ఆల్బమ్‌ ఇప్పుడు యూట్యూబ్‌ ఛానళ్లలో దుమ్ము రేపుతున్నాయి. యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా హిప్‌ హాప్‌ సాంగ్స్‌కు క్రేజ్‌ పెరుగుతోంది. తాజాగా అలాంటి హిప్‌ హాప్‌ మ్యూజికల్‌ పాటతో.. నా వేరే లెవెల్‌ ఆల్బమ్‌ రూపొంది, యూట్యూబ్‌ ఛానళ్లలో సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తోంది. మలేషియా ర్యాపర్‌ కిడ్‌ సాంతే ఆడి పాడి, సంగీతాన్ని అందించిన ఈ ఆల్బమ్‌ కు పార్తీపన్‌ రవి దర్శకత్వం వహించారు. దీన్ని సోనీ మ్యూజిక్‌ సంస్థ విడుదల చేసింది. దీనికి సంబంధించిన మీడియా సమావేశాన్ని బుధవారం చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌ నిర్వహించారు.ఇందులో పాల్గొని హిప్‌ హాప్‌ ర్యాపర్‌ కిడ్‌ సాంతే మాట్లాడుతూ ‘‘ ఈ పాట ద్వారా నన్ను నేను హీరోగానో, సంగీత దర్శకుడుగానో చూపించాలని కోరుకోవడంలేదు. తమిళనాడులోని నిజమైన హీరోలను. చూపించడానికే ఈ మ్యూజికల్‌ ఆల్బమ్‌ను రూపొందించాను. ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుస్తున్నారు. వారే మన జీవితంలో గుర్తింపుకు నోచుకోని నిజమైన హీరోలు. నేను చైన్నెకి వచ్చిన మొదటి సారి కారు పంక్చర్‌ అయినప్పుడు టైర్‌ మార్చడానికి ఒక ఆటో డ్రైవర్‌ సాయం చేస్తున్నప్పుడే నా వేరే లెవెల్‌ పాటకు బీజం పడింది. ఈ ఆల్బమ్‌ను విడుదల చేసిన సోనీ మ్యూజిక్‌ సంస్థకు ధన్యవాదాలు ‘‘ అని మలేషియా ర్యాపర్‌ కిడ్‌ సాంతే పేర్కొన్నారు.

తమిళసినిమా: మహిళలకు అనుకూలంగా ఉండే చట్టాలను కొందరు మహిళలు తప్పుగా వాడుకుంటున్నారని నటి మీరా చోప్రా పేర్కొన్నారు. ఈ బాలీవుడ్‌ భామ ఇంతకు ముందు తమిళంలో మరుదమలై, అన్ఫే ఆరుయిలే, జాంబవాన్‌, తదితర చిత్రాల్లో కథానాయికిగా నటించారు. కాగా నటుడు రవి మోహన్‌, ఆయన భార్య ఆర్తితో విడాకుల వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆర్తి, ఆమె కుటుంబం తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు, తన పిల్లలను కూడా కలవకుండా చేస్తున్నారని, ఆ వేదనతో తాను రెండుసార్లు చేతి నరాలు కట్‌ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఇటీవల మీడియా ముందు వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. ఆర్తి నుంచి విడాకులు పొందే వరకు తాను సినిమాల్లో నటించనని కూడా ఆయన ప్రకటించారు. రవిమోహన్‌ వ్యవహారంపై పలువురు పలు విధాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నటి మీరా చోప్రా ఈ విషయంపై నటుడు రవి మోహన్‌ కు సపోర్ట్‌ గా మాట్లాడం విశేషం. ఆమె ఇటీవల ఒక వేదికపై మాట్లాడుతూ ‘‘ నటుడు రవి మోహన్‌ నాకు బాగా తెలుసు. సమీపకాలంలో ఆయన వివాహ రద్దు వార్తలను చూశాను. వివాహ ముగింపుకు ఎప్పుడూ మగవాళ్లే దోషులుగా ఉండరు. మహిళలకు అనుకూలంగా ఉండే చట్టాలను కొందరు మహిళలు తప్పుగా వాడుకుంటున్నారు. ఒక మగవాడి పక్కన ఉన్న న్యాయాన్ని ఆలకించాలి. నటుడు రవి మోహన్‌ చాలా మంచి వ్యక్తి, నిరాడంబరుడు. ఆయన పక్కన ఉన్న నీతి, న్యాయం గెలుస్తుంది అని నమ్ముతున్నాను ‘‘ అని నటి మీరా చోప్రా పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే నటుడు రవి మోహన్‌ ఇటీవల అయ్యప్ప స్వామి మాల ధరించి వ్రతం పాటిస్తున్నారు.

నటి మీరా చోప్రా

ఎల్లో

ఎల్లో

డర్టీ ఫెలో

ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

చట్టాలను కొందరు

మహిళలు

తప్పుగా..!

Advertisement
 
Advertisement
Advertisement