కొరుక్కుపేట: తమిళగ వెట్రి కళగం (టీవీకే) –ఆవ డి శాసనసభ్యులు డా.ఆర్.రమేష్ కుమార్‌ను తమిళనాడు తెలుగు క్రైస్తవ అసోసియేషన్ అధ్యక్షులు డా.దేవప్రసన్న, నాయకులు రెవ.ఆదాము మద్దూరిలు గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. వారిని శాలువాలతో సత్కరించి తెలుగు క్రైస్తవుల కు తెలుగు సంఘాలకు సంబంధించిన మెమోరాండంను ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ రమేష్ కుమార్ అందజేశారు. మెమోరాండంలోని విషయాలు వా రు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యం.డి.ఆరోన్, తాళ్ళూరి శరత్ బాబు, ఆవడి మోసెస్ తదితరులు పాల్గొన్నారు.


