క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

May 22 2026 4:16 AM | Updated on May 22 2026 4:16 AM

● నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక ● ఇద్దరు యువకుల అరెస్ట్‌ ● కారులో మృతదేహాలు లభ్యం

ఈతకు వెళ్లి మృతి చెందిన విద్యార్థికి.. 495 మార్కులు

తిరువళ్లూరు: పదవ తరగతి పరీక్షలు ముగిసిన తరువాత ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందిన విద్యార్థి 495 మార్కులు సాధించి పాఠశాలలోనే టాపర్‌గా నిలిచిన సంఘటన కంటతడి పెట్టించింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి అయత్తూరు గ్రామానికి చెందిన బాబు. ఇతడికి మోనీక(17), అభిషేక్‌ (15) ఇద్దరు పిల్లలు వున్నారు. మోనీక కవరపేటలోని ప్రభుత్వ పాఠశాలలో ప్లస్‌టూ చదువుతుండగా, అభిషేక్‌ అదే పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో పదవ తరగతి పరిక్షలు ముగిసిన తరువాత ఏప్రిల్‌ రెండున సరదగా ఈత కోసం వెళ్లిన విషాదకరంగా మృతి చెందాడు. ఈ క్రమంలో బుధవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో అభిషేక్‌ 495 మార్కులు సాధించి పాఠశాలలో టాపర్‌గా నిలిచాడు. దీంతో ఆ విద్యార్ధి జ్ఞాపకాలను స్మరించుకుని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కంటతడి పెట్టుకున్నారు.

లీజింగ్‌లో భారీ స్పేస్‌ల హవా

సాక్షి, చైన్నె : నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా 2026 మొద టి త్రైమాసికానికి సంబంధించిన చైన్నె ఆఫీస్‌ స్పే స్‌ మార్కెట్‌ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, చైన్నె నగరంలో కమర్షియల్‌ ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ (కార్యాలయాల అద్దెలు) మార్కెట్‌ ఆరోగ్యకరమైన వృద్ధిని నమోదు చేసింది. ము ఖ్యంగా 1,00,000 చదరపు అడుగులు అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన భారీ కార్యాలయాల లీజింగ్‌.. మొత్తం లావాదేవీల్లో ఏకంగా 44 శాతం వాటాను కై వసం చేసుకుందని ప్రకటించారు. ఈ త్రైమాసికంలో చైన్నె నగరం మొత్తం 1.5 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ లీజింగ్‌ లావాదేవీలను నమోదు చేసిందన్నారు. లక్ష చదరపు అడుగుల కంటే పెద్దవైన కార్యాలయాల లీజింగ్‌ 0.7 మిలియన్‌ చదరపు అడుగులుగా నమోదైందని, ఇది మొత్తం మార్కెట్లో 44శాతం వాటాగా ప్రకటించారు. దేశంలోని ప్రముఖ 8 నగరాల్లో నమో దైన మొత్తం భారీ ఆఫీస్‌ లీజింగ్‌లో చైన్నె నగ రం 3.6% వాటాను కలిగి ఉందన వివరించారు. చైన్నె ఆఫీస్‌ మార్కెట్లో చిన్న, మధ్యస్థ, భారీ స్థాయి కార్యాలయాలకు సమతుల్యమైన డిమాండ్‌ వ్యక్తమవుతోందని వివరించారు.

తూత్తుకుడిలో

మహిళా వ్యాపారి హత్య

తిరువొత్తియూరు: తూత్తుకుడి అన్నానగర్‌ 12వ వీధికి చెందిన అముద (50) అనే మహిళ తన ఇంటి ముందు కిరాణా పాత ఇనుప సామాన్ల దుకాణం నడుపుతున్నారు. ఈమె భర్త భూపాలరాజా ఆటో డ్రైవర్‌. అముద కుమారుడు అరుణ్‌కుమార్‌ 8 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతను తరచుగా మద్యం సేవించి తన తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో అరుణ్‌కుమార్‌ భార్య తరపు బంధువులతో అముదకు గతంలో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో బుధవారం అముద తన దుకాణంలో ఉన్న సమయంలో, బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను కత్తులతో విచక్షణారహితంగా నరికి పారిపోయారు. తీవ్ర గాయాలైన ఆమెను తూత్తుకుడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేసి అరుణ్‌కుమార్‌ భార్య సోదరుడు శంకర్‌ (32), అతని స్నేహితుడు మదన్‌కుమార్‌ (32) ఈహత్యకు పాల్పడినట్లు గుర్తించి వారిని అరెస్ట్‌ చేశారు.

పేడ పౌడర్‌ తాగి దంపతులు మృతి

తిరువొత్తియూరు: కోయంబత్తూరు సింగనల్లూరు ఉప్పిలిపాళయం ఎం.జి.ఆర్‌ కాలనీ, కె.పి. ఆరుముగం వీధికి చెందిన గణేశన్‌ (62), ఆయన భార్య వసంతామణి (57). గణేశన్‌ కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్‌ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు. ఆయన గత కొంతకాలంగా నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో దంపతులిద్దరూ ధారాపురంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి కోయంబత్తూరు వస్తున్నారు. మార్గమధ్యంలో పుత్తరచ్చల్‌ గ్రామం వద్ద వారు ప్రయాణిస్తున్న కారును రోడ్డు పక్కన నిలిపి ఇద్దరూ ప్రమాదకర పేడ పౌడర్‌ తాగి స్పృహ తప్పారు. కారులో వారు అపస్మారక స్థితిలో ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని తదుపరి చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పల్లడం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నకిలీ నగలు ఇచ్చి మోసం చేశారని బ్యాంక్‌ ముందు ధర్నా

తిరువొత్తియూరు: శివగంగ జిల్లా కారైకుడి సమీపంలోని కున్రకుడికి చెందిన మణిరాజా (29) అళగప్ప విశ్వవిద్యాలయంలో తాత్కాలిక ఉద్యోగి. ఇతను గత సంవత్సరం ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో 3 సవర్ల బంగారు నగలను తాకట్టు పెట్టి రూ.1.5 లక్షలు రుణం తీసుకున్నాడు. మే 12వ తేదీన వడ్డీతో సహా నగదు చెల్లించి తన నగలను తిరిగి తీసుకున్నాడు. అయితే మే 14న మళ్లీ అదే బ్యాంకులో ఆ నగలను తాకట్టు పెట్టడానికి వెళ్లగా, అక్కడి నగలు పరిశీలించే వ్యక్తి అవి నకిలీ నగలని, తాకట్టు పెట్టుకోలేమని చెప్పాడు.దీనిపై మణిరాజా పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో, తన కుటుంబంతో కలిసి బ్యాంకు ముందు ధర్నాకు దిగాడు. తాను అసలు నగలే ఇచ్చానని, తిరిగి తీసుకున్నప్పుడు బ్యాంకు సిబ్బంది నగలను మార్చి తనకు నకిలీ నగలు ఇచ్చారని అతను ఆరోపిస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు.

Advertisement
 
Advertisement
Advertisement