మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి ఘన నివాళి | - | Sakshi
Sakshi News home page

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి ఘన నివాళి

May 22 2026 4:16 AM | Updated on May 22 2026 4:16 AM

తిరువళ్లూరు: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతిని తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతలు గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. తిరువళ్లూరులోని డీసీసీ కార్యాలయంలో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి నివాళి అర్పించి దేశం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు శశికుమార్‌ మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ ఆశయాల కోసం కాంగ్రెస్‌ నేతలు కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని సూచించారు. అనంతరం హింసకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివాకర్‌, మైనారీటి విభాగం జిల్లా అధ్యక్షుడు ఖలీల్‌రహ్మాన్‌, పార్టీ నేతలు దాస్‌, మోహన్‌రాజ్‌ పాల్గొన్నారు.

వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో..

వేలూరు: మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో రాజీవ్‌ చిత్ర పటాన్ని ఉంచి పూల మాల వేసి నివాళులర్పించారు. వేలూరులో కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకొని తీవ్ర వాదానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షులు వాహీద్‌బాషా అధ్యక్షతన రాజీవ్‌ చిత్ర పటాన్ని ఉంచి ఆయన సేవల్ని కొనియాడారు. నిరుపేద ప్రజలకు అవసరమైన పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి నేటికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలి పోయారన్నారు. ఆయన ప్రవేశ పెట్టిన పథకాలతోనే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు ఆయన చిత్ర పటాన్ని ఉంచి పూజిస్తున్నారన్నారు. దేశంలో తీవ్ర వాద శక్తులు లేకుండా చేసేందకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు టీకా రామన్‌, మూడవ డివిజన్‌ అద్యక్షులు రగు, ప్రధాన కార్యదర్శి బాలక్రిష్ణన్‌, కప్పల్‌మణి, కోణి కుమార్‌, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అదేవిధంగా వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట, తిరువణ్ణామలై జిల్లాలో తీవ్ర వాదానికి వ్యతిరేకంగా అధికారులు ప్రతిజ్ఞ చేశారు.

రాజీవ్‌గాంధీ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కాంగ్రెస్‌ నేతలు, వేలూరు: రాజీవ్‌ చిత్ర పటానికి పూల మాల వేసి ప్రతిజ్ఞ చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

Advertisement
 
Advertisement
Advertisement