తమిళసినిమా: ఆంటాని వర్గీస్, దుబారా విజయన్, కబీర్ సింగ్,సునిల్, సిద్ధిక్ భరత్ తివారీ, రాజ్ తిరందాస్, హరి శంకర్ నారాయణ్,ఆన్సన్ పాల్, సందీప్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన చిత్రం కాట్టాళన్. వీరితో పాటూ రెండు ఏనుగులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఇంతకు ముందు మార్కో వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ అధినేత షెరీఫ్ ముహమ్మద్ నిర్మించారు. పౌల్ జార్జ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొంటూ ఇది పూర్తిగా అడివిలో జరిగే స్మగ్లింగ్ ఇతివృత్తంతో రూపొందించిన కథా చిత్రం అని చెప్పారు. తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో నిర్మించబడిందని చెప్పారు. భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ఉత్కంఠతను రేకెత్తిస్తుందన్నారు. ఇందులో రెండు ఏనుగులను అటవీశాఖ అధికారులు నుంచి అనుమతి పొంది నటించినట్లు చెప్పారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందించిన ఈ చిత్రాన్ని తమిళం, మలయాళంతో పాటు తెలుగు, కన్నడం, హిందీ భాషల్లోనూ ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీనికి రవి బస్రూర్ సంగీతాన్ని, రీనా దివే ఛాయాగ్రహణం అందించినట్లు చెప్పారు.


