వేలూరు: చోరీ చేసిన సెల్‌ఫోన్‌లను కొనుగోలు చేసినా, విక్రయించిన సంబంధిత వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శివరామన్ అన్నారు. వేలూరు జిల్లా వ్యాప్తంగా సెల్‌ఫోన్‌లు పోగొట్టుకున్న యజమానులకు సెల్‌ఫోన్‌లు అప్పగించే కార్యక్రమం ఎస్పీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం సీఈఐఆర్ వంటి పోర్ట్ ద్వారా గుర్తించిన సుమారు రూ. 50 లక్షల విలువ చేసే మొత్తం 284 సెల్‌ఫోన్‌లను అందజేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం రూ. 4.45 కోట్లు విలువ చేసే సెల్‌ఫోన్‌లు అప్పగించడం జరిగిందని పేర్కొన్నారు. అదనపు ఎస్పీలు పయణి, అన్నాదురై, ధనూష్‌కుమార్, డీఎశ్పీ ఇరుదయరాజ్, సైబర్ క్రైమ్ ఇన్‌స్పెపెక్టర్ కుమార్, ఎస్‌ఐ సతీష్‌కుమార్ తదితరులున్నారు.


