● 94.31 శాతం ఉత్తీర్ణత
ఖైదీల ఉత్తీర్ణత
తమిళనాడులో పరీక్ష రాసిన 13,292 మంది దివ్యాంగులలో 11,416 మంది (85.89శఆతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే, పరీక్ష రాసిన 370 మంది ఖైదీలలో 354 మంది (95.68శాతం) పాసయ్యారు. ప్రైవేట్ అభ్యర్థులు 24,353 మంది హాజరు కాగా 8,744 మంది (35.91శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల విడుదలతో విద్యార్థులకు సమాచారాల్ని వాట్సాప్ ద్వారా, వెబ్‌సైట్ ద్వారా, రిజిస్టడ్ మొబైల్ నెంబర్లకు మెస్సేజ్‌ల ద్వారా తెలియజేశారు.
సాక్షి, చైన్నె: ఎప్పటిలాగే ఈసారి కూడా పదోతరగతి ఫలితాల్లో బాలికలు అద్భుత ప్రతిభ కనబరిచారు. బాలుర కంటే బాలికలు 4.32శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత– 96.47శాతం (మొత్తం రాసిన 4,35,247 మందిలో 4,19,891 మంది పాస్)గా నమోదైంది.
బాలుర ఉత్తీర్ణత– 92.15 శాతం (మొత్తం రాసిన 4,35,396 మందిలో 4,01,214 మంది పాస్). గత ఐదేళ్ల ఫలితాలను పరిశీలిస్తే తమిళనాడులో పదో తరగతి ఉత్తీర్ణత శాతం స్థిరంగా పెరుగుతూ రావడం విశేషం. ప్రభుత్వ పాఠశాలలు – 91.86శాతం, ఎయిడెడ్ పాఠశాలలు– 94.34శాతం, ప్రైవేట్ పాఠశాలలు 98.14శాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయి.
వంద శాతం ఫలితాలు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,467 పాఠశాలలు ఉండగా, అందులో 5,171 పాఠశాలలు 100శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇందులో 1,931 ప్రభుత్వ పాఠశాలలు ఉండటం విశేషం. ఈ ఏడాది తమిళంలో 98.43శాతం ఉత్తీర్ణులు కాగా, 34 మంది 100కు వంద మార్కులు సాధించారు. ఇంగ్లీష్‌లో 99.44శాతం ఉత్తీర్ణులు కాగా, 92 మందికి 100/100 మార్కులు సాధించారు. గణితంలో 97.36శాతం మంది ఉతీర్ణులు కాగా, 3,194 మందికి 100/100 మార్కులు, సైన్స్‌లో 98శాతం ఉతీర్ణత మోదుకాగా 10,476 మందికి 100/100 మార్కులు, సోషల్ సైన్స్‌లో 97.93శాతం ఉత్తీర్ణులు కాగా, 3,336 మందికి 100/100 మార్కులు సాధించడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా పుదుక్కోట్టై జిల్లా అత్యుత్తమ ఫలితాలతో మొదటి స్థానంలో నిలిచింది. పుదుక్కోట్టే జిల్లాలో 97.57శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఆ తదుపరి శివగంగ – 97.54శాతం, తంజావూరు – 97.41శాతం, తిరుచ్చి– 97.31శాతం, కన్యాకుమారి – 97.30శాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయి. చైన్నె జిల్లా 92.34శాతం ఉత్తీర్ణతతో 29వ స్థానంలో నిలిచింది. కేంద్రపాలిత ప్రాంతాలైన కారైకాల్ 96.47శాతం, పుదుచ్చేరి 98.03శాతం ఉత్తీర్ణత సాధించాయి. పుదుచ్చేరిలో 7,061 మంది పరీక్ష రాయగా 6,922 మంది ఉత్తీర్ణులయ్యారు. కారైక్కాల్ పరిధిలోని 1,020 మంది పరీక్షకు హాజరు కాగా, 984 మంది ఉత్తీర్ణులయ్యారు.
రీకౌంటింగ్, సప్లిమెంటరీకి అవకాశం
తాత్కాలిక మార్కుల జాబితా ఈ నెల 22వ తేదీ నుంచి విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలు కల్పించారు. అలాగే వారు చదువుకున్న పాఠశాలల నుంచి పొందేందుకు కూడా అవకాశం ఇచ్చారు. ఆన్సర్ షీట్ స్కాన్ కాపీ కోసం దరఖాస్తులు ఈనెల 22 నుండి 27వ తేదీ వరకు చేసుకోవచ్చు. సప్లిమెంటరీ పరీక్షల రిజిస్ట్రేషన్ ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫెయిల్ అయిన లేదా మార్కులు పెంచుకోవాలనుకునే విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల కోసం ఈ కాలపరిమితిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రీవాల్యుయేషన్, రీటోటలింగ్ దరఖాస్తులు జూన్ 17 నుండి జూన్ 19 వరకు చేసుకోవచ్చు అని ప్రకటించారు. సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ జూలై 08 నుండి జూలై 15 వరకు జరుగుతుందని ముందుగానే తేదీ ప్రకటించేశారు.


