నన్ను ఇస్లామిక్‌గా మార్చేశారు | - | Sakshi
Sakshi News home page

నన్ను ఇస్లామిక్‌గా మార్చేశారు

May 21 2026 2:05 AM | Updated on May 21 2026 2:05 AM

హబీబీ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సినీ ప్రముఖులు

తమిళసినిమా: దర్శకుడు మీరాకదిరవన్‌ అంటే నాకు అతీతమైన అభిమానం. ఆయన లాంటి దర్శకుడిని, శ్రమజీవిని చూసి ఉండవచ్చు. అయితే ఆయన లాంటి వ్యక్తిని చూడడం అరుదే. నేను ఇంత వరకు చిత్రాల్లో నటించలేదు. అలాంటిది దర్శకుడు మీరా కదిరవన్‌ నాపై నమ్మకంతో హబీబీ చిత్రంలో నటింపజేశారు. నేను వెయ్యి శాతం హిందువును, అలాంటి నన్ను ఆయన ఇస్లామిక్‌గా మీరా కదిరవన్‌ కథ మార్చేసింది. హబీబీ చిత్రాన్ని నేను ఇంకా చూడలేదు. చిత్రాన్ని థియేటర్‌లో ప్రేక్షకుల్లో ఒకడిగా చూడాలనుకుంటున్నారు. నేను జీవించి ఉన్నంతకాలం చిత్ర పరిశ్రమలోనే ఉంటాననే నమ్మకాన్ని ఈ చిత్రం కలిగించింది. దర్శకుడు కస్తూరిరాజా తొలిసారిగా ప్రధాన పాత్రను పోషించిన చిత్రం హబీబీ. నేశం ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను మీరాకదిరవన్‌ నిర్వహించారు. మాళవిక మనోజ్‌ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రానికి శ్యామ్‌.సీఎస్‌ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని రోమియో పిక్చర్స్‌ సంస్థ అధినేత రాహుల్‌ ఈనెల 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. చైన్నెలో నిర్వహించిన ప్రీరిలీజ్‌ కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరిరాజా పైవిధంగా పేర్కొన్నారు. దర్శకుడు అమీర్‌, వెట్రిమారన్‌, మిష్కిన్‌, సుశీంద్రన్‌, పాండిరాజ్‌ పాల్గొని. చిత్రం మంచి విజయాన్ని సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement