కఠిన వర్కౌట్స్‌ చేస్తే.. | - | Sakshi
Sakshi News home page

కఠిన వర్కౌట్స్‌ చేస్తే..

May 21 2026 2:05 AM | Updated on May 21 2026 2:05 AM

తమిళసినిమా: తారలకు వర్కౌట్స్‌ చాలా ముఖ్యం. అందానికి అందం, ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం వర్కౌట్స్‌తో కలుగుతుంది. అందుకే చాలా మంది నటీమణుల ఎక్కువ సమయాన్ని వర్కౌట్స్‌కే కేటాయిస్తారు. ఈ విషయంలో హీరోయిన్లకు ఎదురయ్యే చిన్న సమస్య ఏమిటంటే కాస్త బొద్దుగా ఉంటే విమర్శిస్తారు. స్లిమ్‌గా తయారైతే శస్త్ర చికిత్సతో సన్నబడ్డారు అంటారు. ఇలాంటి విమర్శలే కీర్తిసురేష్‌ ఎదుర్కొన్నారట. పాన్‌ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న కథానాయకి కీర్తిసురేష్‌. అలాంటి నటి తాను ఎదుర్కొన్న బాడి షేప్‌ విమర్శల గురించి తొలిసారిగా ఇటీవల తన ఇన్‌స్ట్రాగామ్‌ వేదికగా పేర్కొన్నారు. నా ఫిట్నెస్‌ గురించి ఇప్పటివరకు మాట్లాడింది లేదు. ప్రతిరోజూ నా శరీరం గురించి చాలా నేర్చుకుంటూనే ఉంటాను. 2013లో నేను నటిగా రంగప్రవేశం చేసినప్పుడు నాకేమీ తెలియదు. చాలా మంది లాగానే నేనూ జిమ్‌ మనకు అవసరం లేదు అనుకునేదాన్ని. 2018లో మహానటి చిత్రంలో నటించిన తరువాత వచ్చిన బ్రేక్‌తో నేను ఎందుకు జిమ్‌కు వెళ్ల కూడదు అనే భావన కలిగింది. వర్కౌట్స్‌ చేయడం మొదలెట్టాను. దీంతో 9 నెలల్లో 10 కిలోల బరువు తగ్గాను. దీంతో ప్రేక్షకులు నన్ను శస్త్ర చికిత్స చేయించుకున్నానని చెప్పుకునేంతగా బరువు తగ్గడాన్ని గర్వంగా ఫీల్‌ అయ్యాను. అయితే నేను సహజ సిద్ధంగా వర్కౌట్స్‌ చేసి బరువు తగ్గితే శస్త్ర చికిత్స ద్వారా తగ్గినట్లు ప్రచారం జరగడం బాధనిపించింది అని కీర్తి ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ భామ నటించిన తమిళ చిత్రం కన్నెవెడి విడుదల కావలసి ఉంది.

కీర్తిసురేష్‌

Advertisement
 
Advertisement
Advertisement