పదిలో 92.75 శాతం ఉత్తీర్ణత | - | Sakshi
Sakshi News home page

పదిలో 92.75 శాతం ఉత్తీర్ణత

May 21 2026 2:05 AM | Updated on May 21 2026 2:05 AM

పదిలో 92.75 శాతం ఉత్తీర్ణత ● 28వ స్థానంలో తిరువళ్లూరు జిల్లా

● 28వ స్థానంలో తిరువళ్లూరు జిల్లా

తిరువళ్లూరు: పదో తరగతి ఫలితాల్లో తిరువళ్లూరుకు 28వ స్థానం దక్కగా, మొత్తం 92.75 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లా నుంచి 31,231 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 28,967 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో బాలికలదే పైచేయిగా మారింది. ఈ ఏడాది మూడు శాతం ఎక్కువగా ఉత్తీర్ణత సాదించారు. ఫలితాలు వెలువడిన క్రమంలో చీఫ్‌ ఎడ్యుకేషన్‌ అధికారి కర్పగం పలువురు డీఈఓలు కలెక్టర్‌ ప్రతాప్‌ను కలిశారు. పలితాలపై కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేయగా, వచ్చే ఏడాది మరింత ఉన్నత ఫలితాలను సాధించాలని ఆయన సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement