క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

May 21 2026 2:05 AM | Updated on May 21 2026 2:05 AM

టీవీ రిపోర్టర్‌ పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్‌ ● మరో ఇద్దరి కోసం గాలింపు ఇంటి వద్దకే ఆరోగ్య సేవలు మేనల్లుడి హత్య కేసులో మేనమామ అరెస్ట్‌ డెలివరీ భాగస్వాములకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌

కొరుక్కుపేట: తిరువారూర్‌ జిల్లా, ముత్తుపేటలో నివసించే హాజా ముహైదీన్‌ (38) ఓ ప్రైవేట్‌ టెలివిజన్‌ చానల్‌లో ముత్తుపేట్‌ ఏరియా రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి అతను తన కుటుంబంతో కలిసి ఇంట్లో నిద్రపోతున్నాడు. రాత్రి సుమారు 11.45 గంటలకు, ముత్తుపేట్‌ వీధికి చెందిన అబ్దుల్‌ బాసిత్‌ (20), అతని స్నేహితులు సాబిర్‌ అహ్మద్‌ (21), అబ్బాస్‌ (21) గంజాయి మత్తులో హాజా ముహైదీన్‌ ఇంటికి వెళ్లి తలుపుతట్టారు. హాజా మొయిదీన్‌ తలుపు తీయగా... అబ్దుల్‌ బాసిత్‌ తాను దాచిపెట్టిన బీర్‌ బాటిల్‌ను బయటకు తీసి హాజాముకైద్దీన్‌ తలపై కొట్టాడు, ఆ పగిలిన బాటిల్‌తో అతని కడుపులో, చాతిలో పొడిచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన హాజా ముహైదీన్‌ను తంజావూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయమై ముత్తుపేట పోలీసులు కేసు నమోదు చేసి, మంగళవారం రాత్రి ఇంట్లో దాక్కున్న అబ్దుల్‌ బాసిత్‌ను అరెస్టు చేసి విచారించారు. అనంతరం అతడిని తిరుత్తురై పూండి కోర్టులో హాజరుపరిచారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

సాక్షి, చైన్నె: హెల్త్‌వాచ్‌ టెలిడయాగ్నోస్టిక్స్‌ అనుబంధ సంస్థ సీహెచ్‌సీ ఫార్మసీ చైన్నె నగరంలో తన నెట్‌వర్క్‌ను మరింత విస్తరించింది. బుధవారం ఆదంబాక్కం పరిసర ప్రాంత ప్రజల కోసం తన ఐదో సరికొత్త అవుట్‌లెట్‌ను ‘సీహెచ్‌సీ ఫార్మసీ మినీ’ ఫార్మెట్‌లో ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని ఆసంస్థ సీఎఫ్‌ఓ సీఏ జయశ్రీ కండీషన్‌, సంస్థ సీనియర్‌ ప్రతినిధులు, సిబ్బంది సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా తమ సేవలను గురించి వివరించారు.ఈ మినీ ఫార్మట్‌ స్టోర్లను ఆధునిక కుటుంబాల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్‌ చేశామన్నారు. దీని ద్వారా క్లినిక్‌లకు వెళ్లే పనిలేకుండానే నాణ్యమైన మందులు, వెల్‌నెస్‌ ఉత్పత్తులు, హెల్త్‌కేర్‌ ఎస్సెన్షియల్స్‌తో పాటుగా ఇంటి వద్దకే హెల్త్‌కేర్‌ సేవలైన ల్యాబ్‌ టెస్టులు, బ్లడ్‌ శాంపిల్స్‌ కలెక్షన్‌, కార్డియాక్‌ మానిటరింగ్‌, డయాగ్నోస్టిక్స్‌, ఫిజియోథెరపీ, డాక్టర్‌ కన్సల్టేషన్‌, నర్సింగ్‌ కేర్‌ సేవలను నేరుగా రోగుల ఇంటి వద్దకే అందిస్తామని వివరించారు. కార్యక్రమంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ఎస్‌.సెంథిల్‌ కండీషన్‌, ఉపాధ్యక్షుడు పి. ఆనందకృష్ణన్‌ పాల్గొన్నారు.

తిరువొత్తియూరు: మదురై జిల్లా తిరుమంగళం సమీపం సింధుపట్టిలో మేనల్లుడిని కరత్రో కొట్టి హత్య చేసిన మేనమామను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. సిద్దుపట్టి పోలీసు స్టేషన్‌ పరిధికి ఈచంపట్టికి చెందిన శక్తిమూర్తి (33) జేసీబీ యజమాని. ఇతనికి భార్య భారతి (30) . వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తంగమాయన్‌ (60), శక్తిమూర్తికి వరుసకు మేనమామ అవుతాడు. గత మే 1వ తేదీన శక్తిమూర్తి తన పిల్లలకు చెవులు కుట్టించే కార్యక్రమం నిర్వహించారు. అయితే, ఈ వేడుకకు తంగమాయన్‌ హాజరు కాలేదు. దీనిపై ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు ఏర్పడి గొడవలు మొదలయ్యాయి. ఇటీవల తంగమాయన్‌ తన కుమార్తె లక్ష్మి నిర్వహించిన ఓ వేడుకకు శక్తిమూర్తి కుటుంబం వెళ్లలేదు. దీంతో వీరి మధ్య వివాదం మరింత ముదిరింది. మంగళవారం రాత్రి శక్తిమూర్తి తన భార్యతో కలిసి తంగమాయన్‌ ఇంటికి వెళ్లి ఈ విషయమై నిలదీశాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి, అది ఘర్షణకు దారితీసింది. ఆగ్రహానికి లోనైన తంగమాయన్‌, అక్కడ ఉన్న ఒక కరత్రో శక్తిమూర్తి తలపై బలంగా కొట్టాడు. శక్తిమూర్తిని మదురై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం అతను మృతి చెందాడు. సింధుపట్టి పోలీసులు నిందితుడైన తంగమాయన్‌ను అరెస్ట్‌ చేశారు.

సాక్షి, చైన్నె: లాజిస్టిక్స్‌ నెట్‌వర్క్‌లో పని చేస్తున్న సుమారు 90,000 మంది డెలివరీ అసోసియేట్ల ఆరోగ్యం, భద్రత, ఆర్థిక శ్రేయస్సు కోసం ఉచిత వైద్య బీమా, ఆరోగ్య సేవలను భారీగా విస్తరించినట్టు అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌ సలీమ్‌ మేమన్‌ బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగా మెడిక్లెయిమ్‌, యాక్సిడెంట్‌ భీమా పరిమితులను పెంచడంతో పాటు ఉచిత ఓపీడీ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. రూ. 2,800 కోట్ల భారీ పెట్టుబడి ప్రణాళికలో భాగంగా ఈ వెల్‌నెస్‌ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇన్‌ పేషెంట్‌ హాస్పిటలైజేషన్‌ ఖర్చుల కోసం మెడిక్లెయిమ్‌ పరిమితిని రూ. 1.5 లక్షలకు పెంచామన్నారు. దైనందిన వైద్య ఖర్చులు, డాక్టర్‌ ఫీజుల నిమిత్తం ఏడాదికి రూ. 10,000 వరకు ఓపీడీ కవరేజ్‌ కల్పించామన్నారు. గ్రూప్‌ పర్సనల్‌ యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ పరిమితిని రూ. 10 లక్షల వరకు విస్తరించామన్నారు. దీని ద్వారా ప్రమాదాల వల్ల కలిగే తాత్కాలిక లేదా శాశ్వత వైకల్యాలకు, ఆదాయ నష్టానికి ఆర్థిక రక్షణ లభిస్తుందన్నారు. ఈ ఆరోగ్య ప్రయోజనాలు డెలివరీ భాగస్వామితో పాటు వారి కుటుంబంలోని మరో ముగ్గురు సభ్యులకు వర్తిస్తాయని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement